Last Updated:

PM Modi: తెలంగాణకు ప్రధాని మోదీ వరాలు.. పసుపుబోర్డు, గిరిజన యూనివర్శిటీ

మహబూబ్‌నగర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ 13వేల, 500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణకు ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలమూరు సభ సాక్షిగా ప్రకటించారు.

PM Modi: తెలంగాణకు ప్రధాని మోదీ వరాలు..  పసుపుబోర్డు, గిరిజన యూనివర్శిటీ

PM Modi: మహబూబ్‌నగర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ 13వేల, 500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణకు ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలమూరు సభ సాక్షిగా ప్రకటించారు.

ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ దేశంలో పండగల సీజన్ నడుస్తోంది. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకున్నాం. తెలంగాణలో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం.అనేక రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులు ప్రారంభించాం.ఈ ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి మరింత జోరందుకుంటుందని అన్నారు. తెలంగాణకు తొమ్మిదేళ్లలో లక్షకోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు. 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామని అన్నారు. ఇళ్లు, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని రూ.3,400 కోట్లతో ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు.

రైతులను మభ్యపెడుతున్నారు..(PM Modi)

తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని మోదీ ఆరోపించారు. రుణమాఫీ చేయకపోవడంతో చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. సాగునీటి కాలువల పేరుతో ప్రభుత్వం గొప్పలకు పోతున్నా వాటిలో నీరు ఉండటం లేదని అన్నారు. తెలంగాణలో మా ప్రభుత్వం లేకున్నా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని మోదీ అన్నారు. తెలంగాణ రైతులకు పసుపు బోర్డు మేలు చేస్తుందన్నారు. రైతుల కోసం రామగుండం ఫర్టిలైజర్స్‌ను తెరిపించామన్నారు. సరసమైన ధరల్లో రైతులకు ఎరువులు అందిస్తున్నామని తెలిపారు. రాణి రుద్రమదేవి వంటి ధీరవనితలు పుట్టిన గడ్డ తెలంగాణ అన్న మోదీ మహిళ జీవితాలు మెరుగుపరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు ఈ రాత్రి నిద్ర పట్టదని మోదీ చమత్కరించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు మోదీ వస్తే సీఎం కేసీఆర్ కలవడం లేదని పైగా కేంద్రం ఏమీ చేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైల్వేలు, హైవేల నిర్మాణంలో కేంద్రం తెలంగాణకు అండగా ఉందన్నారు. హైదరాబాద్ చుట్టూ నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డుతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని అన్నారు.