KTR : గోపన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ప్రారంభించలేదు.. కేటీఆర్
హైదరాబాద్ లోని గోపన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇది బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు అని, వెంటనే ప్రారంభించాలని ఆయన సామాజిక మాధ్యమం x లో డిమాండ్ చేశారు.
KTR : హైదరాబాద్ లోని గోపన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇది బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు అని, వెంటనే ప్రారంభించాలని ఆయన సామాజిక మాధ్యమం x లో డిమాండ్ చేశారు.
పనికిమాలిన ప్రభుత్వం..(KTR)
మనకు పనికిమాలిన ప్రభుత్వం మరియు అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది! నల్లగండ్ల, గోపన్‌పల్లి, తెల్లాపూర్, చందానగర్ చుట్టుపక్కల వాసులకు ఉపశమనం కలిగించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గోపన్‌పల్లి ఫ్లైఓవర్ కొన్ని నెలల క్రితం పూర్తయింది. కానీ ఇప్పటికి కూడా, ఇది ప్రారంభోత్సవం కోసం వేచి ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి ఢిల్లీలోని ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ శాసనసభ్యుల ఇళ్లకు మధ్య తిరగడంలో బిజీగా ఉన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కంటే వారి వ్యక్తిగత సంబంధాలకే ప్రాధాన్యమిస్తోంది. ప్రజలే దాని సంగతి తేలుస్తారంటూ కేటీఆర్ ట్వీట్ చేసారు.
This is what happens when we have an inept government and clueless leadership!
The Gopanpally flyover, initiated by the BRS Government to bring relief to residents around Nallagandla, Gopanpally, Tellapur, and Chandanagar, was completed a few months ago. But even today, it is… pic.twitter.com/AoFDSAArC0
— KTR (@KTRBRS) July 12, 2024