Prajadarbar: ప్రజాదర్బార్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు
హైదరాబాద్ జ్యోతిరావు పులే భవన్ ( ప్రగతి భవన్ )లో ప్రజా దర్భార్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రగతి భవన్ కు వచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకుని ఆయా శాఖల అధికారులకు పంపించి.. పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.

Prajadarbar: హైదరాబాద్ జ్యోతిరావు పులే భవన్ ( ప్రగతి భవన్ )లో ప్రజా దర్భార్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రగతి భవన్ కు వచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకుని ఆయా శాఖల అధికారులకు పంపించి.. పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
పోటెత్తిన ప్రజలు..(Prajadarbar)
ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఉదయం నుంచే పోటెత్తారు. ప్రజల నుంచి ఆర్టీలు తీసుకోవడానికి హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసారు. కొండపోచమ్మ ముంపు బాధితులు సీఎం ను కలిసి తమకు నష్టపరిహారం అందలేదని వివరించారు. ఎన్ఎస్ యుఐ రాష్ట్ర నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జెన్ కో ఏఈ నియామక పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఇలా ఉండగా పలువురు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేసారు. ఈ రోజు ప్రజాదర్బార్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుపలువురు మంత్రులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ప్రగతి భవన్ కు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజా దర్భార్ కోసం వచ్చిన అధికారులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయించారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ప్రజా దర్భార్ నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి:
- Janasena chief Pawan Kalyan: మార్పు కోసమే ఓట్లు అడుగుతాను.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్
- Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర వేడుకలకు వీవీఐపీలకు ఆహ్వానం