Last Updated:

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర వేడుకలకు వీవీఐపీలకు ఆహ్వానం

అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22న జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 3,000 మంది వీవీఐపీలు, 4,000 మంది సాధువులు  సహా 7,000 మందికి పైగా ఆహ్వానాలను పంపింది.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర వేడుకలకు వీవీఐపీలకు ఆహ్వానం

Ayodhya Ram Mandir: అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22న జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 3,000 మంది వీవీఐపీలు, 4,000 మంది సాధువులు  సహా 7,000 మందికి పైగా ఆహ్వానాలను పంపింది.

వీవీఐపీల జాబితాలో ..(Ayodhya Ram Mandir)

రామాలయ ట్రస్ట్‌కు చెందిన 3,000 మంది వీవీఐపీల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, నటి కంగనా రనౌత్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ,యోగా గురు రామ్‌దేవ్, మరియు పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబాయ్, రతన్ టాటా మరియు గౌతమ్ అదానీ,ప్రముఖ టీవీ సీరియల్ ‘రామాయణ్’లో రాముడి పాత్రను పోషించిన నటుడు అరుణ్ గోవిల్‌తో పాటు సీత పాత్రను పోషించిన దీపికా చిక్లియా తదితరులు ఉన్నారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, దాదాపు 50 దేశాల నుండి ప్రతినిధులను కూడా పవిత్రోత్సవానికి ఆహ్వానించామన్నారు. అలాగే, రామ మందిరం ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కర్ సేవకుల కుటుంబ సభ్యులకు గౌరవం మరియు కృతజ్ఞతగా, వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని తెలిపారు.విశిష్ట వేద పండితుడు పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్, అతని ఇద్దరు కుమారులు, పండిట్ జైకృష్ణ దీక్షిత్ మరియు సునీల్ దీక్షిత్, ఇద్దరు నిష్ణాతులైన వేద పండితులు, కాశీకి చెందిన మరో 18 మంది పండిట్‌లతో కూడిన బృందానికి నాయకత్వం వహిస్తారు.