Tirumala: శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy Visits Tirumala Temple: తిరుమల వేంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కొనియాడారు.
తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు నిషేధిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. రాజకీయాలు మాట్లాడే వారిపై కేసులు పెట్టడంతో పాటు శ్రీవారి దర్శనం కల్పించకూడదన్నారు. అన్యమత ఉద్యోగులను టీటీడీ నుంచి పంపివేయాలన్న నిర్ణయం స్వాగతిస్తున్నామన్నారు. తిరుపతి స్థానికులకు నెలకొకసారి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. టూరిజం దర్శనం టిక్కెట్లలో గతంలో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.