Published On:

Cm Chandrababu : టీటీడీ భక్తులకు చంద్రబాబు శుభవార్త.. త్వరలో వాట్సాప్ సేవలు

Cm Chandrababu : టీటీడీ భక్తులకు చంద్రబాబు శుభవార్త.. త్వరలో వాట్సాప్ సేవలు

Cm Chandrababu : తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. భక్తుల కోసం వాట్సప్ సేవలు త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రతి సేవపై భక్తుల ఫీడ్ బ్యాక్ తమకు అందేలా త్వరలో వాట్సాప్ సేవలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇవాళ సచివాలయంలో టీటీడీపై సీఎం సమీక్ష నిర్వహించారు.

 

 

 

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ సేవలు, సౌకర్యాల్లో 100శాతం మార్పు కనిపించాలని పేర్కొన్నారు. తిరుమలలో సేవలు బాగుంటే, ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని గుర్తుచేశారు. అభివృద్ధి పనుల పేరుతో డబ్బులు ఖర్చు పెట్టకూడదని హెచ్చరించారు. వచ్చే 50 ఏళ్ల వరకు అనుగుణంగా టీటీడీ మండలిని తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి భక్తునికి మెరుగైన సేవలు అందించాలన్నారు. అనుభవం ఉన్న పేరుతో అవసరం లేకపోయినా పాతవారిని కూడా కొనసాగించకూడదని హెచ్చరించారు. త్వరలో జేఈవో,
సీవీఎస్‌వో, ఎస్‌వీబీసీ చైర్మన్, బీఐఆర్‌ఆర్‌డీ డైరెక్టర్ల నియామకం ఉంటున్నారు. ప్రక్షాళన వందశాతం జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఏ స్థాయిలో మినహాయింపులు లేవన్నారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్‌ క్యాంపు నిర్మాణం ఉంటుందని చెప్పారు. 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: