Home / Tirumala
Road accident in Tirumala Two devotees died: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలోని నరసింగాపురంలో భక్తులను 108 వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు పుంగనూరు నుంచి కాలినడకన వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ 108 వాహనం వేగంగా వచ్చింది. మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం రోగిని తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్తుంది. […]
Union Minister Kishan Reddy Visits Tirumala Temple: తిరుమల వేంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కొనియాడారు. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు నిషేధిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. రాజకీయాలు […]
ఎర్రచందనం దొంగలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుమలలో దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు దళారులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. తిరుమలలో గదుల దళారులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. ముగ్గురు దళారులు నాగ బ్రహ్మచారి, కేఈ వెంకటేశ్వరరావుతో పాటు మరో వ్యక్తిని సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభమైందని..తిరుమల మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ నినాదం తప్ప వేరేది వినిపించకూడదని చంద్రబాబు అన్నారు.
: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 20 గంటలు పడుతుంది . శుక్రవారం రద్దీ మరి ఎక్కువైంది . వారాంతరం కావడంతో రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకు విఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అస్సాంవాసులు తిరుమలలోని మోకాళ్ళ పర్వతంపై డ్రోన్తో వీడియో తీశారు. మోకాళ్ళ పర్వత ప్రాంతం, ఘాట్ రోడ్డులను అస్సాం వాసులు షూట్ చేశారు.అస్సాంకు చెందిన దంపతులిద్దరూ కారులో మోకాళ్ళ పర్వతంపైకి వచ్చి డ్రోన్ను వినియోగించారు.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా చేరుకున్నారు. తెల్లవారుజామున 1:30 నిమిషాలకే విఐపిలను దర్శనానికి అనుమతించారు.