Minister Anitha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత

Vangalapudi Anitha Visits Tirumala Temple: తిరుపతిలోని తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆమె వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు అనిత కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అదే విధంగా ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ముక్కులు చెల్లించారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
అంతకుముందు, తిరుమలలో ఆది వరాహ క్షేత్రంగా పిలవబడే శ్వేత వరాహ రూపంలో వెలసిన ఆ శ్రీమన్నారాయణుడిని హోం మంత్రి అనితతో పాటు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ మేరు ఆలయ అధికారుల, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.