Tirumala Accident: తిరుమలలో విషాదం.. ఇద్దరు భక్తులు మృతి
![Tirumala Accident: తిరుమలలో విషాదం.. ఇద్దరు భక్తులు మృతి](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/01/Road-accident-in-Tirumala.jpeg)
Road accident in Tirumala Two devotees died: తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలోని నరసింగాపురంలో భక్తులను 108 వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు పుంగనూరు నుంచి కాలినడకన వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ 108 వాహనం వేగంగా వచ్చింది.
మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం రోగిని తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్తుంది. ఈ ప్రమాదంలో అన్నమయ్య జిల్లాలోని రామసముద్రం మండలంలోని చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ(40), లక్ష్మమ్మ(45)లు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.