Last Updated:

BJP : వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం.. ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

BJP : వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం.. ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

BJP : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20శాతం ఓట్లు కూడా రాకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు 150 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 60 సీట్లు వచ్చినప్పుడు సభకు వెళ్లలేదని, ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే.. ప్రతిపక్ష అర్హత కావాలని అడుగుతున్నారని, జగన్ వైఖరి రెండు నాలుకల ధోరణికి నిదర్శనమన్నారు.

 

 

వైఎస్ జగన్‌కు మరోసారి అధికారం ఇస్తే ఏపీ అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. విశాఖ రాజధాని అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కానీ, రూ.500కోట్లతో ప్యాలస్ కట్టుకున్నారన్నారు. జగన్‌కు మళ్లీ అధికారం కోరే హక్కు లేదన్నారు. నాయకులు వల్ల స్టీల్ ప్లాంట్ నష్టపోయిందన్నారు. ఉద్యమం వల్ల నష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్కడ పోరాటం చేస్తున్న వాళ్లు ఎక్కడ నుంచి వచ్చారు..?మీ ఆస్తులు ఎంత, ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

 

 

ప్రధాని మోదీ నాయత్వంలో ఒక రూట్ మ్యాప్ ఉంటుందని, అది బహిర్గతంగా కనిపించదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో విస్తృతమైన అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. అసెంబ్లీకి వెళ్లను అనే వ్యక్తా ఏపీ ప్రజలకు కావాల్సిందని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ నష్టపోవడానికి కార్మిక సంఘాల నాయకులే కారణమన్నారు. ఎక్కడ నుంచి వచ్చారు, ఎంత ఆస్తులు సంపాదించారు, ఉద్యమాలు చేస్తూ రెచ్చగొట్టి పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్మిక సంఘాలు రాజకీయాలు చేయకుండా, కష్టపడి లాభాల్లోకి తీసుకువెళ్లగలరా అని సవాల్ విసిరారు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రధాని మోదీకి తెలుసు అన్నారు. వికసిత భారత్, స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంతో కూటమి ముందుకెళ్తుందని సోము వీర్రాజు తెలిపారు.

ఇవి కూడా చదవండి: