Last Updated:

Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 15 ఫైర్ స్టేషన్లు.. 382 ఉద్యోగాలు

అగ్ని ప్రమాదాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 15 ఫైర్ స్టేషన్లు.. 382 ఉద్యోగాలు

Govt Jobs: అగ్ని ప్రమాదాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ మేరకు అగ్నిమాపక కేంద్రాలు, ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కాగా, కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో 367 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 15 పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకోనున్నారు. కాగా మల్కాజిగిరి, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, షాద్‌నగర్, అంబర్‌పేట, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, స్టేషన్ ఘనపూర్, డోర్నకల్, నర్సాపూర్, హుస్నాబాద్, కల్వకుర్తి, బాల్కొండ, ధర్మపురి, పినపాక నియోజకవర్గాల్లో కొత్తగా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చదవండి: చికోటి ప్రవీణ్ క్యాసినో కేసు.. మంత్రి తలసాని సోదరులను విచారిస్తున్న ఈడీ

 

ఇవి కూడా చదవండి: