Jobs Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో భారీగా పోస్టుల భర్తీ

Jobs Notifications in telangana revenue department: నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలన అధికారుల పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని ఈ నియామకాలు చేపట్టనున్నారు. కాగా, ఈ ప్రక్రియను త్వరలోనే మొదలుకానుందని తెలిపింది. ఇదిలా ఉండగా, ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసింది. అంతేకాకుండా ఈ రెండు వ్యవస్థలను మండల శాఖలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వ్యవస్థపై కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో మళ్లీ గ్రామ పాలన ఉండేలా అధికారులను నియమించుకోవడం తప్పనిసరి అంటూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.