SLBC : ఎస్‌ఎల్‌బీసీ నుంచి ఒక మృతదేహం వెలికితీత

SLBC : నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సొరంగంలో గల్లంతైన 8 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. కార్మికుల జాడ కోసం 16 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళ క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో కూలీల ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించాయి. దీంతో గుర్తించిన ప్రాంతంలో సిబ్బంది మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోర్టుమార్టం కోసం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 7 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సొరంగం తవ్వకాల్లో ప్రమాదం చోటుచేసుకుని 8 మంది కూరుకుపోయిన విషయం తెలిసిందే. సొరంగంలో కూరుకుపోయిన వారి జాడ కోసం 15 రోజులుగా వివిధ ఏజెన్సీలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు.