Home / Jubilee Hills
Telangana: అనారోగ్యంతో నాలుగు రోజులుగా గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటితో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం మాగంటి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. […]
BRS: బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. నాలుగు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా.. పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తలు ఆయనకు సంతాపం ప్రకటించారు. కాగా మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2018, 2023 […]