Published On:

Telangana Housing Recruitment 2025: 390 ఏఈ పోస్టులకు 6 రోజులే గడువు.. దరఖాస్తు చేసుకోండిలా?

Telangana Housing Recruitment 2025: 390 ఏఈ పోస్టులకు 6 రోజులే గడువు.. దరఖాస్తు చేసుకోండిలా?

Telangana Assistant Executive Engineer Housing Recruitment 2025: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 390 పోస్టులు ఖాళీగా ఉండగా.. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏఈలను ఏడాది కాలానికి నియమించనుంది.

 

కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీ హామీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణం చేపట్టనుంది. ఇందులో భాగంగానే నిరుపేదలకు వివిధ దశల్లో నిర్మాణం చేపట్టి సొంత ఇళ్లు అందించనుంది. ఇప్పటికే ఈ పథకం కింద పనులు చేపట్టింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేపడుతున్న ఇంటి నిర్మాణ తనిఖీలను చేపట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

సివిల్ ఇంజినీర్ విభాగంలో బీటెక్ అభ్యర్థులతో పాటు 18 నుంచి 44 వయసులోపు ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.33,800 వేతనం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెబ్ సైట్ https://tghousing.cgg.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తులు 2025 ఏప్రిల్ 4న ప్రారంభమవ్వగా.. 2025 ఏప్రిల్ 11తో ముగియనుంది.

 

ఈ ఉద్యోగానికి ఇంజినీరింగ్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. వయసులో సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు ఉండగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్ల వయసు సడలింపు అవకాశం కల్పించారు. ఇక, దివ్యాంగ అభ్యర్థులకు 10ఏళ్లు వయసు సడలింపు ఇచ్చారు.