SS Rajamouli: సూర్య కాదు.. నేనే తనతో సినిమా ఛాన్స్ మిస్ అయ్యా: డైరెక్టర్ రాజమౌళి
SS Rajamouli Speech at Kanguva Event: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కంగువా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇండియా వైడ్‌గా ప్రమోషన్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి, డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో జక్కన్న మాట్లాడుతూ.. సూర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఓ ఇంటర్య్వూలో సూర్య… రాజమౌళితో సినిమా చాన్స్ మిస్ అయ్యానంటూ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజానికి సూర్య నా సినిమా ఛాన్స్ మిస్ చేసుకోలేదని, నేనే సూర్యతో సినిమా చాన్స్ మిస్ అయ్యానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా తన పాన్ ఇండియా సినిమా బాహుబలి చేయడానికి సూర్యనే తనకు స్ఫూర్తి అంటూ ఊహించని కామెంట్స్ చేశారు. “తెలుగు సినిమాని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా ప్రపంచానికి చూపించే విషయంలో సూర్యనే నాకు స్ఫూర్తి. గజిని మూవీ టైంలో సూర్య చేసిన ప్రచారాన్ని గమనించాను.
వేరే ఇండస్ట్రీకి చెందిన నటుడు తెలుగు ప్రేక్షకులకు ఎలా దగ్గర కాగలిగాడు అని క్షుణ్ణంగా పరిశీలించి. ఈ విషయాన్ని కేస్‌స్టడిగా తీసుకోమని తరచూ తెలుగు హీరోలు, నిర్మాతలను కూడా చెప్పేవాడిని. అలా సూర్య స్ఫూర్తితోనే తొలి పాన్ ఇండియా చిత్రం బాహుబలి తీశాను” అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం మాట్లాడుతూ… సూర్య, నేను ఓ సినిమా చేయాలనుకున్నాం. కానీ అది కుదరట్లేదు. నాతో సినిమాను మిస్ అయ్యానని సూర్య ఓ ఈవెంట్‌లో అన్నారు.
ఆయన మిస్ అవ్వడం కాదు.. నేను ఆ ఛాన్స్ మిస్ అయ్యా” అన్నారు. అలాగే సూర్య యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. కంగువా టీం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిందో మేకింగ్ వీడియో చూస్తే అర్థమైందన్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని, ఇలాంటి బారీ ప్రాజెక్ట్స్ విషయంలో సాంకేతిక నిపుణులను దర్శకుడు ఎంతగా టార్చర్ చేస్తాడో నాకు తెలుసు అంటూ నవ్వుతూ అన్నారు. ప్రస్తుతం రాజమౌళి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ శివ దర్శకత్వలో రూపొందిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది.