Last Updated:

Prithviraj Sukumaran About SSMB29: ఏడాది క్రితమే SSMB29లో భాగం అయ్యాను – కన్‌ఫాం చేసిన ‘సలార్‌’ నటుడు

Prithviraj Sukumaran About SSMB29: ఏడాది క్రితమే SSMB29లో భాగం అయ్యాను – కన్‌ఫాం చేసిన ‘సలార్‌’ నటుడు

Prithviraj Sukumaran Confirms He Acts in SSMB29: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందుతోంది. ఎస్‌ఎస్‌ఎంబీ29(SSMB29) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాని సెట్‌పైకి తీసుకువచ్చారు. ఇప్పటికే రెండు షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అప్‌డేట్స్‌ ఏం లేకుండానే సైలెంట్‌గా మూవీ షూటింగ్‌ని స్టార్ట్‌ చేశారు. ఇటీవల ఒడిశాలో షూటింగ్‌ జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్‌లో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొన్నారు.

సైలెంట్ గా షూటింగ్

అయితే ఈ సినిమాకు సంబంధించి మూవీ టీం నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ రావడం లేదు. దీంతో అంతా SSMb29 అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో SSMB29కి సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఇచ్చారు స్టార్‌ హీరో. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ పాన్‌ వరల్డ్ ప్రాజెక్ట్‌లో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఈ క్రమంలో జక్కన్న సినిమాలో తాను భాగమయ్యాయని చెప్పేశారు పృథ్వీరాజ్.

పృథ్వీరాజ్ సుకుమారన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రభాస్‌ సలార్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ఆయన SSMహ29లో నటిస్తున్నారని తెలిసి అంతా ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. అయితే ఇప్పటి వరకు దీనిపై మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కానీ ఇటీవల ఒడిసా షూటింగ్‌ సెట్స్‌ నుంచి లీకైన వీడియోలో ఆయన కనిపించారు. ఈ షెడ్యూల్‌ కోసం మహేష్‌ ఒడిసా వెళుతుండగా.. తనతో పాటు పృథ్వీరాజ్ కూడా కనిపించారు. దీంతో ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నారన్నది కన్‌ఫాం అయ్యింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఏడాది నుంచే SSMb29 కోసం వర్క్ చేస్తున్నా

ప్రస్తుతం ఆయన మలయాళంలో ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన రాజమౌళి-మహేష్‌ సినిమాపై స్పందించారు. “ఏడాది క్రితమే రాజమౌళి సినిమాలో నేను భాగం అయ్యాను. అప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ చేస్తున్నాం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దీని గురించి నేను ఇప్పుడేం మాట్లాడలేను. త్వరలోనే టీం నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ రావాలని కోరుకుందాం” అని చెప్పుకొచ్చారు. అనంతరం వీడియో లీక్‌పై ఆయన స్పందించారు. ప్రజలు ఎందుకు లీక్‌ వీడియోల పట్ల ఉత్సహం చూపిస్తారో అర్థం కావడం లేదన్నారు. అలా చూడటంతో వల్ల ఆసక్తిని కోల్పోతారని, బిగ్‌స్క్రీన్‌పై ఆ సర్‌ప్రైజ్‌ ఆస్వాదించలేమన్నారు.