Keerthy Suresh: తెలుగులో లక్కీ ఛాన్స్ పట్టేసిన మహానటి.. ?

Keerthy Suresh: అందాల భామ కీర్తి సురేష్.. మహానటి తరువాత తెలుగులో అంత పెద్ద హిట్ ను అందుకోలేదు అనే చెప్పాలి. మహానటి తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఆమె .. దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్నా.. అది నాని ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ భామ.. ఆ తరువాత బాలీవుడ్ లో పాగా వేయడానికి రెడీ అయ్యింది. బేబీ జాన్ సినిమాతో అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కోసం ఎప్పుడు లేనివిధంగా అందాల ఆరబోతకు కూడా సిద్దమయ్యింది.
బొద్దుగా ముద్దుగా ఉండే కీర్తి.. సన్నగా , నాజూకుగా తయారయ్యి.. అందాల ఆరబోత చేయడం తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. అయ్యో కీర్తి .. ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావ్ అంటూ కామెంట్స్ పెట్టారు. ఇక ఇవేమి పట్టించుకోని కీర్తి వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. బాలీవుడ్ లో బేబీ జాన్ తో పరాజయాన్ని అందుకున్న ఈ చిన్నది ఇప్పుడు వెబ్ సిరీస్ లపై పడింది. అక్కా అనే వెబ్ సిరీస్ లో కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇది కాకుండా తమిళ్ లో మరో రెండు సినిమాలు చేస్తుంది.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం తెలుగులో కీర్తి సురేష్ లక్కీ ఛాన్స్ ను పట్టేసిందని తెలుస్తోంది. గతేడాది లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి.. తదుపరి సినిమా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 796సీసీ అనే టైటిల్ ను ఫైనల్ చేశారని టాక్ నడుస్తుంది. ఇక ఇందులో సూర్య సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ సెలెక్ట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.
మారుతీ కార్లు ఇండియాకు రావడానికి ఒక వ్యక్తి ఎంత కష్టపడ్డాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరక్కనుందని టాక్ నడుస్తోంది. నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక బయోపిక్ లాంటిదే. కానీ, కొన్ని కామర్శకియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ప్రేక్షకులకు నచ్చేవిధంగా రూపొందిస్తున్నారట. 796సీసీ అంటే.. మారుతీ ఇంజిన్ కెపాసిటీ అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఇదే కనుక నిజమైతే కీర్తికి నిజంగానే లక్కీ ఛాన్స్ వచ్చిందని చెప్పాలి. వెంకీ అట్లూరి సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మరి ఈ సినిమాతోనైనా కీర్తి తెలుగులో బిజీ అవుతుందో లేదో చూడాలి.