Last Updated:

Sonali Phogat : సోనాలి ఫోగట్ కేసు – సుధీర్ సగ్వాన్ మరియు సుఖ్విందర్ సింగ్ లపై సీబీఐ చార్జిషీట్

బీజేపీ నేత సోనాలి ఫోగట్ కేసు లో సీబీఐ మంగళవారం తన మొదటి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.

Sonali Phogat : సోనాలి ఫోగట్ కేసు – సుధీర్ సగ్వాన్ మరియు సుఖ్విందర్ సింగ్ లపై  సీబీఐ చార్జిషీట్

Sonali Phogat: బీజేపీ నేత సోనాలి ఫోగట్ కేసు లో సీబీఐ మంగళవారం తన మొదటి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. దీనిలో సుధీర్ సగ్వాన్ మరియు సుఖ్‌విందర్ సింగ్‌ల పేర్లను పేర్కొంది. ఫోగట్ (43) ఆగష్టు 23 న అంజునాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాబడింది, ఆమెకు త్రాగడానికి నిషేధిత పదార్థాన్ని ఇచ్చారని పోలీసులు ఆరోపించారు.

మాజీ టిక్ టాక్ స్టార్ అయిన 43 ఏళ్ల ఫోగట్ సంఘటన జరగడానికి ఒక రోజు ముందు సుధీర్ సాంగ్వాన్ మరియు సుఖ్‌విందర్ సింగ్‌లతో కలిసి గోవాకు వచ్చారు. ఫోగట్ బస చేసిన హోటల్‌తో పాటు పాక్షికంగా కూల్చివేసిన గోవాలోని కర్లీస్ రెస్టారెంట్‌ను కూడా సీబీఐ బృందం సందర్శించిందని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సుధీర్ సగ్వాన్, సుఖ్వీందర్ సింగ్ సహా ఐదుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు.

ఈ కేసును సీబీఐకి అప్పగించే ముందు గోవా పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. గోవా పోలీసులు తమ దర్యాప్తులో, సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలు ఉటంకిస్తూ అంజునా బీచ్‌లోని కర్లీ వద్ద నిందితులు మెథాంఫేటమిన్ డ్రగ్స్ త్రాగమని ఫోగట్‌ను బలవంతం చేసినట్లు కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి: