Last Updated:

Nitish Kumar: బీహార్ సీఎంగా ఎనిమిదోసారి ప్రమాణస్వీకారం చేయనున్న నితీష్ కుమార్

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ నేడు ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారంపై స్పష్టత లేదు. నితీష్‌ కుమార్‌ ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ద్రోహం చేశారని ఆరోపిస్తూ బీజేపీ

Nitish Kumar: బీహార్ సీఎంగా ఎనిమిదోసారి ప్రమాణస్వీకారం చేయనున్న నితీష్ కుమార్

Bihar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ నేడు ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం పై స్పష్టత లేదు. నితీష్‌ కుమార్‌ ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ద్రోహం చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఈరోజు పాట్నాలో భారీ నిరసన చేపట్టింది. జిల్లాల్లోనూ నిరసనలు చేపట్టాలని యోచిస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ డాక్టర్ సంజయ్ జైస్వాల్ బీహార్ ప్రజలు నితీశ్ కుమార్‌ను ఎప్పటికీ క్షమించరని అన్నారు.

బిజెపి-జనతాదళ్ (యునైటెడ్) ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తార్కిషోర్ ప్రసాద్ పొత్తు కొనసాగేలా తమ వంతు ప్రయత్నం చేశామని చెప్పారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నితీష్ కుమార్‌తో మాట్లాడారని తెలిపారు. నితీష్ కుమార్ 2015లో లాలూ యాదవ్, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వియాదవ్ కూడ అప్పటి నితీష్ కుమార్ క్యాబినెట్లో వున్నారు. అయితే తరువాత నితీష్ మూడు పార్టీల కూటమి నుండి తప్పుకున్నారు. ఆయన తిరిగి బీజేపీలో చేరిన తర్వాత కొన్ని అంశాలపై బీజేపీతో విబేధించారు. జూన్‌లో, కుల గణనను నిర్వహించడానికి కేంద్రం నిరాకరించడం నితీష్ కు ఆగ్రహాన్ని కలిగించించింది. మరోవైపు కులగణణ చేయాలంటూ తేజస్వి యాదవ్ కూడ నితీష్ కు పూర్తిగా మద్దతు ఇచ్చాడు.
ఇది ఇలావుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెడియులో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్న వార్తలు కూడ నితీష్ లో ఆందోళన రేకెత్తించాయి. కేంద్ర మంత్రివర్గంలో చేరిన తమ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆర్‌సిపి సింగ్‌ను జెడియు తనవైపు తిప్పుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని ముఖ్యమంత్రి భావించారు. అందువల్ల రాజ్యసభలో ఆర్‌సిపి సింగ్‌ పదవీకాలాన్ని పొడిగించడానికి అతను నిరాకరించాడు. దీనితో అతను ప్రధాని మోడీ మంత్రివర్గం నుండి రాజీనామా చేయవలసి వచ్చింది. అంతేకాదు, నితీష్ కుమార్ సహాయకులు బహిరంగంగా ఆర్‌సిపి సింగ్‌అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. దీనికి నిరసనగా సింగ్ జేడీయూ నుంచి వైదొలిగారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిరాగ్ పాశ్వాన్ కు పరోక్షంగా మద్దతు ఇవ్వడం వలనే జేడీయూకు సీట్లు తగ్గాయని పలువురి భావన. బీహార్‌లో మహారాష్ట్ర నమూనాను పునరావృతం చేసేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని నితీష్ కుమార్ భావించారు. వీటన్నిటి నేపధ్యంలో చివరకు నితీష్ కుమార్ ఎన్డీఏకు గుడ్ బై చెప్పి మరలా ఆర్జేడీ, కాంగ్రెస్ లతో చేతులు కలిపారు.

ఇవి కూడా చదవండి: