Home / nitish kumar
బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు చెందిన జనతాదళ్ (యు)కు లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌కు మధ్య బేధాభిప్రాయాలు గురువారం తారాస్తాయికి చేరాయని పాట్నాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు తలెత్తున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్న నితీష్ కూటమికి హ్యాండ్ ఇచ్చి .. రాబోయే లోకసభలో ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు లలన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. జేడీయూ కొత్త చీఫ్‌గా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నియమితులయ్యారు.శుక్రవారం ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
డిసెంబర్ 6 న జరగాల్సిన I.N.D.I.A కూటమి సమావేశం పలువురు ముఖ్య నేతలు రాకపోవడంతో వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , నితీష్ కుమార్‌తో సహా కూటమిలోని కొంతమంది కీలక సభ్యులు సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
బీహార్ అసెంబ్లీ గురువారం రిజర్వేషన్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి మొత్తం 75 శాతానికి పెంచే ప్రతిపాదనను బీహార్ కేబినెట్ ఆమోదించింది.
బీహార్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులాల సర్వే ఆధారంగా ప్రజల సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం మంగళవారం డేటాను విడుదల చేసింది. . డేటా ప్రకారంఅగ్రవర్ణాల్లో భూమిహార్లలో పేదరికం ఎక్కువగా ఉంది. బీహార్‌లో 27.58 శాతం భూమిహార్లు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని డేటా పేర్కొంది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. నితీష్ కుమార్ వెంట డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసేందుకు ఈ సమావేశం జరిగింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ఆయన డిప్యూటీ తేజస్వి యాదవ్ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు రాహుల్ గాంధీతో సమావేశమై సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు.
మణిపూర్ రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార భారతీయ జనతా పార్టీలో విలీనమయ్యారు. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పవచ్చు.
బీహార్ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీతో అసౌకర్యంగా ఉండటం వల్ల తెగతెంపులు చేసుకుని ఇతర పార్టీల పొత్తుతో నితీష్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని అన్నారు. ఒకప్పడు ప్రశాంత్ కిశోర్ నితీష్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడు.
జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి మంగళవారం రాజీనామా చేయడంతో బీజేపీతో ఆయన ప్రయాణం ముగిసింది. బీహార్ లో తాజాగా మారిన రాజకీయపరిణామాల వెనుక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వున్నారు. బీజేపీ పై నితీశ్ లో పేరుకుంటున్న అసంతృప్తిని ఆయన గమనించారు.