Last Updated:

Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించారా?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో తీవ్ర గందరగోళం నెలకొంది.ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై బీబీసీ..

Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించారా?

Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో తీవ్ర గందరగోళం నెలకొంది.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై బీబీసీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్ ’అనే డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే.

అయితే కేంద్ర ప్రభుత్వ ఈ డాక్యుమెంటరీ ప్రసారాన్ని కేంద్రం బ్లాక్ చేసింది. అయితే హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్ లో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడం ఇపుడు వివాదాస్పదం అయింది.

అనుమతి లేకుండా స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(SIO),ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్(MSF) విద్యార్థి సంఘాలు ఈ డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు.

నార్త్ షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో 50 మంది విద్యార్థులతో ఈ షో నిర్వహించారు.

 

విద్యార్థి సంఘాల్లో ఘర్షణ

డాక్యుమెంటరీ స్క్రీనింగ్ విషయంలో విద్యార్థి సంఘాల్లో గొడవ జరిగింది. ప్రధాని మోదికి వ్యతిరేకంగా ఉన్న వీడియోను స్క్రీనింగ్ చేస్తున్నారని ఫెటర్నేటి గ్రూప్ ను మరో వర్గం అడ్డుకుంది.

దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ వర్గం నినాదాలు చేసింది.

దీంతో ఒక్కసారిగా క్యాంపస్ లో హై టెన్షన్ నెలకొంది. క్యాంపస్ సిబ్బంది జోక్యంతో వివాదం సద్దుమనిగి నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇరు వర్గాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

అల్లర్లు సృష్టించడానికి ఈ ప్రయత్నాలు: ఏబీవీపీ

డాక్యుమెంటరీ ప్రదర్శించడంపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (abvp)ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఏబీవీపీ యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది.

ఘటన పై నివేదిక వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.

దేశంలో మళ్ళీ అల్లర్లు సృష్టించడానికి ఈ ప్రయత్నాలు అంటూ ఏబీవీపీ మండిపడింది.

యూనివర్సిటీ రూల్స్ కి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడిన వారిపై, స్క్రీన్ ప్రదర్శించిన.. వీక్షించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.

 

కాగా, గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.

ఈ అల్లర్లలో మోదీ పాత్ర ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని పలు వర్గాల నుంచి ఆరోపణలు వచ్చాయి.

గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇలాంటి డాక్యుమెంటరీ రావడంపై విమర్శలు వచ్చాయి.

దీంతో కేంద్ర ప్రభుత్వం డాక్యుమెంటరీ కి సంబంధించిన వీడియోలను బ్లాక్ చేయాలని ట్విటర్, యూట్యూబ్ లను ఆదేశించింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/