Last Updated:

E Racing: ఈ రేసింగ్‌ లో గందరగోళం.. ట్రాక్ పైకి సాధారణ వాహనాలు

E Racing: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ -రేసింగ్ లో గందరగోళం నెలకొంది. దీంతో ఈ రేస్ ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణ వాహనాలు ఒక్కసారిగా.. ట్రాక్ పైకి రావడంతో 45 నిమిషాల పాటు రేసింగ్ కు అంతరాయం ఏర్పడింది. వాహనాలను తొలగించడంతో తిరిగి రేసింగ్ ప్రారంభమైంది.

E Racing: ఈ రేసింగ్‌ లో గందరగోళం.. ట్రాక్ పైకి సాధారణ వాహనాలు

E Racing: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ -రేసింగ్ లో గందరగోళం నెలకొంది. దీంతో ఈ రేస్ ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణ వాహనాలు ఒక్కసారిగా.. ట్రాక్ పైకి రావడంతో 45 నిమిషాల పాటు రేసింగ్ కు అంతరాయం ఏర్పడింది. వాహనాలను తొలగించడంతో తిరిగి రేసింగ్ ప్రారంభమైంది.

గందరగోళం.. ట్రాక్ పైకి వాహనాలు

హైదరాబాద్ నడిబొడ్డున గల హూస్సేన్ సాగర్ సమీపంలో జరుగుతున్న ప్రాక్టీస్ రేస్ లో గందరగోళం నెలకొంది. నిర్ణయించిన సమయం ప్రకారం.. సాయంత్రం 4.30 గంటలకు రేస్‌ జరగాల్సి ఉంది. కానీ ఒక్కసారిగా వాహనాలు ట్రాక్ పైకి రావడంతో.. రేస్ నిలిచిపోయింది. వాటిని బయటకు పంపించాక.. సాధారణ వాహనాలు లేవని గుర్తించాక ప్రాక్టీస్ రేస్ (E Racing) కు అనుమతి ఇచ్చారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఈ-కార్ రేస్ ప్రారంభంలో ప్రమాదం

ఈ రేసింగ్ ప్రారంభమైన కాసేపటికే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్ పై ఓ మూల మలుపు వద్ద ఓ రేసర్ డివైడర్ ను ఢీ కొట్టాడు. దీంతో కొద్దిసేపు రేస్ నిలిపివేశారు. ఈ రేసింగ్ లో టర్నింగ్ వద్ద కారు నేరుగా డివైడర్ ను ఢీ కొట్టడంతో.. ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురైన కారును క్రేన్ సహాయంతో తొలగించారు. ట్రాక్ మీదకు నార్మల్ వాహనాలు రావడాన్ని అధికారులు సిరీయస్ గా తీసుకున్నారు. ఈ వాహనాలను అనుమతించిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు.

ఈ రేసింగ్.. సినీ తారల సందడి

హుస్సెన్ సాగర్ తీరంలో జరుగుతున్న ఈ రేసింగ్ లో సినీతారలు సందడి చేశారు. ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీ ప్రణతి, నారా బ్రాహ్మణి ఇతర ప్రముఖులు రేస్‌ Formula E-Raceను చూసేందుకు వచ్చారు. మరో వైపు వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు.. ఈ రేసుతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, లక్డీకాపూల్‌, అసెంబ్లీ, ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ స్తంభించింది. ఫార్ములా-1 రేస్ కు 2011–2013లో ఇండియా మెుదటిసారి అతిథ్యం ఇచ్చింది. దీని తర్వాత హైదరాబాద్ లో ప్రపంచస్థాయిలో జరుగుతుంది.

ఫార్ములా-1 కి ఫార్ములా-ఈ కార్ రేస్ కు తేడాలు ఉన్నాయి.

ఫార్ములా-1 కోసం హైబ్రిడ్ టర్బో-ఛార్జర్డ్ ఇంజన్ల రేసింగ్ కార్లు వాడతారు.

ఫార్ములా-ఈ కోసం బ్యాటరీ ఆధారిత, పర్యావరణ సహిత ఎలక్ట్రిక్‌ రేసింగ్ కార్లను వినియోగిస్తారు.

గత ఎనిమిది సీజన్లలో ఫార్ములా-ఈకి మంచి స్పందన వచ్చింది.

దాంతో ఈ సారి హైదరాబాద్ లో దీన్ని నిర్వహిస్తున్నారు.