Gold Prices Today: పెరిగిన బంగారం ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే!

Gold Prices Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. 10గ్రాముల ధర లక్ష రూపాయలకు చేరుకోనుంది. గతవారం బంగారం ధర తగ్గుముఖం చూపినా ఇప్పుడు తిరిగి పుంజుకుంది. భారత్ పాక్ మధ్య పెరుగుతున్న ఘర్షణ కారణం ఒకెత్తయితే అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరను అమాంతం పెంచేస్తున్నాయి.
ఇప్పడు రెండు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2500 పెరిగి రూ. 90,250కి చేరింది.
24క్యారెట్ల బంగారం ధర 2 వేల 730 కి పెరిగి 98వేల 460కి చేరింది. ఒక 18 క్యారెట్ల బంగారం ధర 73వేల 840కి చేరింది.
ఢిల్లీ, ముంబైలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 100గ్రాములకు 25 వేలు పెరిగి తులం రూ.90,400కి చేరింది. 18క్యారెట్ల బంగారం ధర 73979కి చేరింది. ముంబైలో 22క్యారెట్ల బంగారం ధర 90వేల 250కి చేరింది.
విశాఖ పట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.99వేల570గా ఉంది.
ప్రొద్దుటూరులో పది గ్రాముల బంగారం ధర 99వేల570గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లలో గెల్డ్ రేట్లు పెరిగాయి. సోమవారం 3,354 డాలర్లు ఉండగా మంగళవారం నాటికి 3,258డాలర్లకు చేరింది.
వెండి ధరలు స్వల్ప తగ్గుదలను చూపాయి
మంగళవారం ఉదయం వెండి ధర 100 రూపాయలు తగ్గింది.
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1,07900
విజయవాడలో కిలో వెండి ధర రూ. 1,07900
విశాఖపట్నంలో కిలో వెండి ధర 1,07900
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,00500
ముంబై కిలో వెండి ధర రూ.1,00500
బంగారం, వెండి ధరలు ప్రతీ గంటకు మారుతూ ఉంటుంది. కాబట్టి షాపుకు వెళ్లినప్పుడు అప్పటిరేటును గమనించగలరు. ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశం ఉంటుంది.