Last Updated:

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో రూ.75వేల కోట్ల పెట్టుబడులు పెడతాము.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఉత్తరప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆయన యూపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ -2023 లో మాట్లాడుతూ.. టెలికం, రిటైల్‌, న్యూ ఎనర్జీ వ్యాపారాల్లో వచ్చే నాలుగు సంవత్సరాల్లో 75వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో రూ.75వేల కోట్ల పెట్టుబడులు పెడతాము.. రిలయన్స్ ఇండస్ట్రీస్  చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ

Uttar Pradesh:రిలయన్స్‌ ఇండస్ట్రీస్ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఉత్తరప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆయన యూపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ -2023 లో మాట్లాడుతూ.. టెలికం, రిటైల్‌, న్యూ ఎనర్జీ వ్యాపారాల్లో వచ్చే నాలుగు సంవత్సరాల్లో 75వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు. దీని ద్వారా లక్ష మందికి ఉపాధి కల్పిస్తామన్నారు ముఖేష్‌ అంబానీ. కాగా రాష్ర్టంలో ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి జీయో 5జీ అందుబాటులోకి తెస్తామన్నారు.

యూపీ గ్లోబల్‌ సమ్మిట్‌లో ముఖేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో  10 గిగావాట్ల రెన్యూవబుల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు బయో ఎనరజీ వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. కాగా ఈ ఏడాది బడ్జెట్ తో భారత్‌ అభివృద్ది చెందిన దేశాల సరసన చేరిపోతుందన్నారు. కాగా కేంద్రప్రభుత్వం మూలధనం వ్యయంపై పెద్ద ఎత్తున కేటాయింపులు చేసిందన్నారు. వృద్దిరేటులో భారత్‌ శరవేగంగా దూసుకుపోతోందన్నారు.యూపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ 2023ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్నో ప్రారంభించారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ ఈ నెల 10 నుంచి 12 వరకు కొనసాగుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు కేంద్రమంత్రులతో పాటు దేశంలోని అతి పెద్ద పారిశ్రామికవేత్తలు హాజరువుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌ సమూలంగా మారిపోయింది.. ప్రధాని మోదీ (Uttar Pradesh)

ఈ సమ్మిట్‌కు ఇన్వెస్టర్లను స్వాగతిస్తున్నానంటూ ప్రసంగించిన మోదీ ఉత్తరప్రదేశ్‌ సమూలంగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో సుపరిపానలతో పాటు స్థిరమైన ప్రభుత్వం, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోని ఇన్వెస్టర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానకర్తలు, పారిశ్రామిక నాయకులు, విద్యావంతులు, మేధావులు అందరూ కలిసి ఇక్కడి వ్యాపారావకాశలపై ఫోకస్‌ పెట్టాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆలోచన ధోరణిలో సమూలమైన మార్పును గమనించానని మోదీ చెప్పారు. మొత్తం మౌలికరంగంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ వల్ల న్యూ ఇండియా గ్రోత్‌ ఇంజిన్‌ యూపీగా ఉంటుందన్నారు. విద్యుత్‌ నుంచి కనెక్టివిటి వరకు అన్నీ రంగాల్లో యూపీ దూసుకుపోతోందన్నారు. అభివృద్ది పథంలో రాష్ర్టం శరవేగంగా దూసుకుపోతోందన్నారు మోదీ

ఇక్కడ వ్యాపారావకాశాల విషయానికి వస్తే డెయిరీ, ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెక్టార్‌తో పాటు నేచురల్‌ ఫార్మింగ్‌లో బోలెడన్నీ అవకాశాలున్నాయి.ప్రస్తుతం దేశంలోని వ్యవసాయరంగంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. రైతులు వ్యవసాయంపై వ్యయాన్ని తగ్గించుకొనే పనిలో పడ్డాయి. కాబట్టి నేచుల్‌ పార్మింగ్‌ని ప్రోత్సహించాలని ప్రధానమంత్రి సూచించారు. ఇవే కాకుండా వైద్య, విద్య, గ్రీన్‌ గ్రోత్‌, షోషల్‌ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌లో ఇన్వెస్టర్లకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు ప్రధానమంత్రి మోదీ.

ప్రపంచంలోనే పెట్టుబడులకు గమ్యస్దానంగా ఉత్తరప్రదేశ్..రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ప్రపంచంలోనే పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రంలో ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, పెట్టుబడులపై రాబడి పెరిగిందని సింగ్ చెప్పారు.నేడు ప్రపంచంలో పెట్టుబడులకు భారత్‌ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని, యూపీ ఎదుగుదల, భారత్‌ ఎదుగుదల ఒకే నాణేనికి రెండు వైపులని ఆయన అన్నారు.

గత ప్రభుత్వాలపై సింగ్ విమర్శలు గుప్పించారు. వివిధ వనరులు మరియు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ, ప్రజలు వ్యాపార రంగంలోకి ప్రవేశించడానికి వెనుకాడిన కాలాన్ని దేశం చూసింది” అని అన్నారు. “సూడో సెక్యులరిజం పేరుతో, పారిశ్రామికవేత్తలను ముందుకు సాగకుండా ఆపారు.స్థాపించబడిన పరిశ్రమలకు నష్టం కలిగించారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: