Allu Aravind : నెపోటిజం గురించి నోరు విప్పిన అల్లు అరవింద్… వాళ్ళు ఖచ్చితంగా ట్రోల్ చేస్తారంటూ !
తెలుగు సినీ పరిశ్రమలో నటుడి గా, కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు రామలింగయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయన వారసులుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ పలు సినిమాల్లో నటించినప్పటికీ,
Allu Aravind : తెలుగు సినీ పరిశ్రమలో నటుడి గా, కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు రామలింగయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయన వారసులుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ పలు సినిమాల్లో నటించినప్పటికీ, ప్రధానంగా నిర్మాత గానే కంటిన్యూ అవుతూ వచ్చారు. గీత ఆర్ట్స్ సంస్థ పేరుతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించి టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల కాలంలో కేవలం తెలుగు లోనే కాకుండా పలు భాషల్లో కూడా మంచి హిట్ సాధించిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తూ మంచి టెస్ట్ ఉన్న నిర్మాత అనిపించుకుంటున్నారు.
కాగా గత ఏడాది ” ఆహా ” అనే ఓటీటీ సంస్థను ప్రారంభించిన అల్లు అరవింద్ అందులో కూడా సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఆహా ఓటీటీ లో టాక్ షో లు , సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉండగా ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. అలానే ఇటీవల అల్లు స్టూడియోస్ నిర్మాణాన్ని కూడా చేపట్టిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో నెపోటిజం అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంధర్భంలో ఈ చర్చ తీవ్ర రూపం దాల్చింది. సుశాంత్ మరణానికి నెపోటిజం మాత్రమే ప్రధాన కారణమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలోనే బాయ్ కాట్ నెపోటిజం అంటూ అలియా భట్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, మహేష్ భట్, పలువురు నెపో కిడ్స్ ని ట్రోల్ చేశారు.
అయితే తెలుగు సినిమా పరిశ్రమలోనూ అప్పుడప్పుడు నెపోటిజం పట్ల పలువురు నోరు విప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ లోనూ వారసత్వం నుంచి వచ్చిన హీరోలు ఎక్కువ గానే గమనించవచ్చు. ముఖ్యంగా ఆ నాలుగు ఫ్యామిలీ లకు సంబంధించిన వారే ఎక్కువగా ఉన్నారంటూ ఇప్పటికీ పలువురు ఆరోపిస్తూనే ఉంటారు. అయితే ఇదే తరుణంలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో గెస్ట్ గా నిర్మాత దగ్గుబాటి సురేష్ తో కలిసి పాల్గొన్నారు అల్లు అరవింద్. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నెపోటిజం ఉందంటూ పలువురు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. నెపోటిజంపై మీ అభిప్రాయం ఏంటి అని బాలకృష్ణ అడిగారు. ఇందుకు అల్లు అరవింద్ బదులు ఇస్తూ తన మనసులో మాటని బయట పెట్టారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ … నెపోటిజంపై నా సమాధానం విషయంలో నన్ను ట్రోల్ చేసినా పర్లేదు. నెపోటిజం అని విమర్శించే వాళ్లు గుండెల మీద చేయి వేసుకొని ఒక విషయం చెప్పాలి. వాళ్లకు కూడా ఇలాంటి అవకాశం వస్తే ఉపయోగించుకునేవారా ? లేక ఇది నెపోటిజం అని పక్కకు వెళ్లిపోయేవారా?. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగి ఆ ఇంట్రెస్ట్ ఉండి, టాలెంట్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఉన్న మార్గంలో నడిస్తే తప్పేంటి? అని అల్లు అరవింద్ ప్రశ్నించారు. అలానే తన స్నేహితుడు అయిన ఒక లాయర్ గురించి కూడా చెప్పారు.
నాకు ఒక లాయర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు లాయర్లు. ఆ తర్వాత ఆయనా అదే వృత్తిలోకి వచ్చారు. జడ్జి అయ్యాడు. తన ఇద్దరు కుమారులలో పెద్దవాడికి నటన అంటే ఆసక్తి ఉండి.. ఆర్టిస్ట్ అయ్యాడు. చిన్నవాడు ఆ వాతావరణంలో పెరగడం వల్ల లాయర్ అయ్యాడు. దాన్ని నెపోటిజం అని విమర్శించలేం కదా. లాయర్లు, డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్ మెన్ ఇలా ప్రతి రంగం లోనూ వారసులు వస్తున్నారు. దానిని నెపోటిజం అనలేం కదా అని అరవింద్ కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.