Published On:

Jubilee Hills: టాలీవుడ్ హీరోకు షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

Jubilee Hills: టాలీవుడ్ హీరోకు షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

Bellamkonda Srinivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం సినీ హీరో శ్రీనివాస్.. ట్రాఫిక్ లో హల్ చల్ చేశాడు. రాంగ్ రూట్ లో కారు డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు. అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకుని రాంగ్ రూట్ లో రావడంపై ప్రశ్నించారు.

 

దీంతో హీరో శ్రీనివాస్ అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడంతో పాటు డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసుతో దురుసుగా ప్రవర్తించినందుకు గాను బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆయనపై ఎలా చర్యలు తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.