Allu Aravind: నేను పరమ పోరంబోకును.. పెద్ద మనిషిలా మారి.. ఇలా ఉన్నాను

Allu Aravind: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో హిట్ సినిమాలు నిర్మించి.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అల్లు అరవింద్.. ఇప్పుడు గీతా ఆర్ట్స్ మొత్తాన్ని బన్నీ వాస్ చేతిలో పెట్టి.. మిగతా చిన్న చిన్న విషయాలను చూసుకుంటున్నాడు. బన్నీ వాసు సైతం.. అల్లు అరవింద్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి కథలను ఎంచుకుని హిట్స్ ఇస్తున్నాడు.
తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న చిత్రం సింగిల్. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా సింగిల్ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కు తన కాలేజ్ డేస్ గురించి ప్రశ్న ఎదురైంది. ఈ సినిమా ట్రైలర్ లో ఆల్ఫా మ్యాన్, మాస్ అని చెప్పుకొచ్చారు. మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు అన్న ప్రశ్నకు అల్లు అరవింద్ ఒక్కసారిగా తన ఒరిజినాలిటీ చూపించేశాడు. పెద్ద మనిషి అని కాని, స్టార్ నిర్మాత అని కూడా ఆలోచించకుండా అప్పట్లో తనొక పెద్ద పోరంబోకు అని చెప్పుకొచ్చాడు.
” నేను పరమ పోరంబోకు.. చాలా ఒక్క మాటలో చెప్పాను. పరమ రౌడీ బాయ్స్ లో ఒకడిగా పెరిగి వచ్చి ఆ తర్వాత అది కరెక్ట్ కాదేమో అనుకోని ఇక్కడ సెటిల్ అయ్యి.. పెద్దమనిషి అయ్యి..పెద్ద మనిషి వేషాలు వేస్తున్నాను” అంటూ అనేశాడు. సాధారణంగా అయితే.. ఇలాంటి మాటలు అనాలంటే.. ఎవరికైనా కొద్దిగా కష్టమే. కానీ, అరవింద్ మాత్రం యంగ్ ఏజ్ లోకి వెళ్ళిపోయి తన ఒరిజినాలిటీ బయటపెట్టేసాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.