Bus accident in Sri Lanka: శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది మృతి..!

15 People died in Sri Lanka Bus Accident: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో 15 మందికిపైగా మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున 70 మంది బౌద్ధ యాత్రికులతో కోట్మలేలోని కొండలలోని ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. దాదాపు 30 మంది ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం. అయితే ప్రమాద సమయంలో బస్సులో పరిమితికి మించి యాత్రికులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రమాదంలో బస్సు మొత్తం ధ్వంసమైంది. గాయపడిన ప్రయాణికుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.