Published On:

thug life telugu Trailer: ఇది యముడికి.. నాకు జరిగే కథ – యాక్షన్‌, థ్రిల్లర్‌తో ఆకట్టుకుంటున్న థగ్‌ లైఫ్‌ ట్రైలర్‌

thug life telugu Trailer: ఇది యముడికి.. నాకు జరిగే కథ – యాక్షన్‌, థ్రిల్లర్‌తో ఆకట్టుకుంటున్న థగ్‌ లైఫ్‌ ట్రైలర్‌

Thug Life Telugu Official Trailer Release: లోకనాయకుడు కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా ‘థగ్‌ లైఫ్‌’. దాదాపు 36 సంవత్సరాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్‌ 5న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ విడుదల చేసింది మూవీ టీం. తెలుగు, తమిళంలో రెండు భాషల్లో థగ్‌ లైఫ్‌ ట్రైలర్‌ విడుదలైంది.

 

ఈ ట్రైలర్‌ మొత్తం యాక్షన్‌ థ్రిల్లర్‌గా సాగింది. ట్రైలర్‌ బట్టి చూస్తుంటే ఇదోక గ్యాంగస్టర్‌ మూవీ అని అర్థమైపోతుంది. ఇందులో కమల్‌ హాసన్‌ గ్యాంగస్టర్‌గా కనిపించబోతున్నట్టు అనిపిస్తుంది. ‘నువ్వు నా ప్రాణం కాపాడినోడివి.. యముడికి దొరకకుండ వెనక్కి లాగినోడివి.. నీ తలరాత.. నాతల రాత ఒకటిగా రాసినాడు. ఇకనుండి నవ్వు నేను ఒకటే..చివరి దాకా’ అనే డైలాగ్‌ టీజర్‌ మొదలైంది. చిన్నప్పుడు కమల్‌ హాసన్‌ దొరికి ఆయన దగ్గర పెరిగి పెద్దవుతాడు. అతడి సామ్రాజ్యానికి అధిపతిగా కూడా ప్రకటిస్తాడు. అయితే అనుకోకుండ వీరి మధ్య దూరం పెరుగుతుంది.

 

ఆ గ్యాప్‌ ఎందుకు వచ్చింది. నువ్వు-నేను ఒక్కటే అన్నట్టు ఉన్న వారిద్దరు శత్రువులుగా ఎలా మారారు. ఇక ట్రైలర్‌ చివరిలో కమల్‌ హాసన్‌, శింబు మధ్య చూపించిన యాక్షన్‌ సీన్‌ మూవీపై ఆసక్తిని పెంచుతుంది. అదే ఇది యముడికి.. నాకు జరిగే కథ అని కమల్‌ హాసన్‌ చెప్పిన డైలాగ్‌ ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి ట్రైలర్‌ చూస్తుంటే థగ్‌ లైఫ్‌ బ్లాక్‌బస్టర్‌ బొమ్మే అనేట్టుగా ఉంది. ఇందులో కమల్‌ హాసన్‌ జోడిగా అభిరామి, త్రిషలు నటించారు.

 

ఇక శింబు సరసన సన్య మల్హోత్రా నటించింది. అలాగే నాజర్‌, ఐశ్వర్య లక్ష్మి, జోజూ జార్జ్‌, గౌతమ్‌ కార్తిక్‌ వంటి తదితర నటులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సింగీతం, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచాయి. ట్రైలర్‌లోని విజువల్స్‌ చూస్తుంటే రిచ్‌గా అనిపించాయి. చూస్తుంటే కమల్‌కు మరో విక్రమ్‌ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఖాయం అనేట్టు ఉంది. యాక్షన్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో థగ్‌ లైఫ్‌ ట్రైలర్‌ మూవీ మరింత బజ్‌ పెంచింది. మరి థియేటర్లోకి వచ్చాక ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.