Published On:

DMK MP: డీఎంకే ఎంపీకి తప్పిన ముప్పు.. వేదికపై కూలిన లైట్ సెట్

DMK MP: డీఎంకే ఎంపీకి తప్పిన ముప్పు.. వేదికపై కూలిన లైట్ సెట్

Tamilnadu: డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఏ. రాజాకు పెద్ద ప్రమాదం తప్పింది. తమిళనాడులోని మైలాదుతురైలో నిర్వహించిన పార్టీ సభలో మాట్లాడుతుండగా భారీ లైట్ సెట్ వేదికపైకి కూలింది. ఎంపీ రాజా ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.

అయితే బలంగా వీచిన గాలుల వల్లే లైట్ స్టాండ్ కదిలిందని, అది కాస్తా వేదికపైకి పడిపోయిందని పలువురు చెప్తున్నారు. సభలో ప్రమాదం జరగడంతో డీఎంకే నేతలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కార్యకర్తలు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు.

అయితే ఈ ప్రమాదం ఆదివారం జరిగింది. నిన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పుట్టినరోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. అందుకు సంబంధించి ఎంపీ రాజా ప్రసంగిస్తుండగా స్టీల్ రాడ్ కు అమర్చిన బరువైన లైట్ సెట్.. మైక్ పై పడింది. ఎంపీ రాజాకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.