Published On:

BUS: యూపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

BUS: యూపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

Uttar Pradesh: యూపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజధాని లక్నో కిసాన్ పాత్ లో బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో ఇవాళ ఉదయం మంటలు చెలరేగాయి. ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

 

ప్రమాదం జరిగిన సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు సమాచారం. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కారణాలు తెలియలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. మంటలు రావడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ తప్పించుకున్నారు. మంటలతో బస్సు డోర్లు లాక్ కావడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. చనిపోయిన వారు బస్సు వెనుక సీట్లలో కూర్చున్న వారిగా గుర్తించారు. ఎమర్జెన్సీ డోర్లు తెరుచుకోకపోవడంతోనే వారు చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.