Sankranthiki Vasthunnam: ఓటీటీ కంటే ముందే టీవీలో సంక్రాంతికి వస్తున్నాం – ఎప్పుడంటే!

Sankranthiki Vasthunam OTT: హీరో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లోకి వచ్చిన చిత్రాల్లో ఈ సినిమానే రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ష్ వర్స్ కురిపిస్తూ రూ. 300 కోట్ల పైగా కలెక్షన్స్ చేసింది. ఇటీవల మూవీ టీం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫైనల్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది. మూవీ విడుదలైన నెల రోజులు అయిపోయింది. ఇప్పటికీ పలు థియేటర్లో ఈ సినిమా సక్సెస్ ఫుల్ రన్ అవుతూనే ఉంది.
ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ విడుదలైన నెల రోజులు అయిపోయింది. దీంతో ఈ సినిమా కోసం డిజిటల్ ప్రీమియర్ కోసం ఓటీటీ ప్రీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ క్రమంలో మూవీ ఓటీటీకి సంబంధించి ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ జీ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల దీనిపై జీ సంస్థ ప్రకటన కూడా ఇచ్చింది. అదే విధంగా ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ని కూడా జీ సంస్థ కోనుగోలు చేసింది. ఇక మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టిన నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం భారీగా చెల్లించి శాటిలైట్, డిజిటల్ హక్కులను కోనుగోలను చేసినట్టు తెలుస్తోంది.
దాదాపు రూ. 27 కోట్లతో ఈ చిత్రాన్ని సొంతం చేసుకుందని సమాచారం. అయితే సంక్రాంతికి వస్తున్నాం వైబ్‌ని ఆస్వాధించడానికి రెడీ ఉండంటూ అంటూ ప్రకటన ఇచ్చింది. అయితే ఈ సినిమాను ఓటీటీలో కంటే ముందు టీవీలో ప్రసారం చేయబోతున్నట్టు జీ తెలుగు స్పష్టం చేసింది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ టీవీలో వస్తున్నామంటూ.. ఫస్ట్ వచ్చేది టీవీలోనే అని పేర్కొంది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీ కంటే ముందు టీవీలో ప్రసారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే జీ సంస్థ ఇది వరకు పలు చిత్రాలకు ఈ స్ట్రాటజీనే అప్లై చేసింది. ముందు టీవీలో ప్రసారం చేసిన తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేసింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాను టీవీ టెలికాస్ట్ చేసిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కి ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే టీవీ ప్రీమియర్‌కి సంబంధించిన తేదీ ఇంకా ఖరారు చేయలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.