Nani- Vijay Devarakonda: అదేంటీ.. నాని – విజయ్ ల మధ్య వార్ అన్నారే.. వీరేంటీ ఇలా కలిసిపోయారు

Nani- Vijay Devarakonda: ఒక ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ వార్స్ గురించి ఒక మాట చెప్పాడు. మేము మేము బాగానే ఉంటాం.. మీరే బావుండాలి అని అది అక్షర సత్యం అని ఎప్పటికప్పుడు హీరోలు నిరూపిస్తూనే ఉన్నారు. స్టార్ హీరో, కుర్ర హీరో అని తేడా లేదు. టాలెంట్ ఉన్నవారిని హీరోలు సైతం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. టాలీవుడ్ హీరోస్ కు ఎప్పుడు సినిమాలతో పోటీనే తప్ప.. వ్యక్తిగతంగా ఏరోజు ఎక్కువా తక్కువ అని చూసుకున్నది లేదు.
ఫ్యాన్స్ అందు టాలీవుడ్ ఫ్యాన్స్ వేరయా అన్నట్లు.. ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు వార్స్ చేస్తూనే ఉంటారు. మా హీరో ఎక్కువ అంటే మా హీరో ఎక్కువ అని కొందరు. మీ హీరో రికార్డ్స్ కన్నా మా హీరో రికార్డ్స్ ఎక్కువ అని ఇంకొందరు.. ఇలా నిత్యం ఫ్యాన్స్ వార్ చేస్తూ సోషల్ మీడియాను హీట్ ఎక్కించేస్తున్నారు. గత కొన్ని రోజులుగా హీరో నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ నడిచింది.
ఇక ఈ జనరేషన్ లో గొప్ప యాక్టర్ ఎవరు అనే చర్చలో నాని, విజయ్ దేవరకొండ వచ్చారు. నాని ఫ్యాన్స్ విజయ్ కన్నా నానినే గొప్ప యాక్టర్. అసలు విజయ్ కు లైఫ్ ఇచ్చింది నానినే అని చెప్పుకురాగా.. ఎప్పుడు వచ్చాం అన్నది కాదు అన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లు విజయ్ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు.
ప్రస్తుతం నాని, విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా మారారు. ఎవరినీ తీసేయడానికి లేదు. కాకపోతే నాని విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విజయ్ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్ కు వారే ఫుల్ స్టాప్ పెట్టారు. వీరిద్దరూ కలిసి కనిపించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు.
విజయ్ హీరో అవ్వడానికన్నా ముందే నాని హీరోగా ఎస్టాబిలిష్ అయ్యాడు. ఆ సమయంలో వచ్చిందే ఎవడే సుబ్రహ్మణ్యం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని, విజయ్ దేవరకొండ హీరోలుగా కనిపించారు. కొద్దిసేపు ఉన్నా కూడా విజయ్ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమాతోనే మాళవిక నాయర్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే నాగ్ అశ్విన్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా మార్చి 21 కి పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ, నాని కలిసి సందడి చేశారు. ఈ ఒక్క కలయిక ఎంతోమంది ఫ్యాన్స్ వార్స్ కు చెక్ పెట్టింది. ఇలా చూసినప్పుడే మహేష్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది అని కొందరు చెప్పుకొస్తుండగా.. ఇంకొందరు మాత్రం అదేంటీ.. నాని – విజయ్ ల మధ్య వార్ అన్నారే.. వీరేంటీ ఇలా కలిసిపోయారు అని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటికైనా ఫ్యాన్ వార్స్ చేయడం మానేస్తే బెటర్ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.