Sekhar Master Trolling: ఒకపక్క బూతులు తిట్టాలి.. ఇంకోపక్క ట్రెండ్ చేయాలి

Sekhar Master Trolling: జనరేషన్ మారుతోంది.. ట్రెండ్ కు తగ్గట్లు ఉంటేనే అందరూ మాట్లాడుకుంటారు. ఎప్పుడు ఒకేలా ఉంటే.. ఎవరూ మాట్లాడరు. అందుకే కాలంతో కలిసిపోవాలి అని పెద్దలు చెప్తుంటారు. ఇదే మాటను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటిస్తున్నాడు అని చెప్పొచ్చు. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ మొదటి స్థానంలో ఉన్నాడు. అంతకుముందు జానీ మాస్టర్ కు, శేఖర్ మాస్టర్ కు కొద్దిగా పోటీ ఉండేది. ఈ మధ్య జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి వచ్చాకా టాలీవుడ్ లో శేఖర్ మాస్టరే చక్రం తిప్పుతున్నాడు.
ఇక శేఖర్ మాస్టర్ స్టెప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలకు అయితే దబిడిదిబిడి ఆడించడమే. కానీ, ఈ మధ్యకాలంలో శేఖర్ మాస్టర్ స్టెప్స్ వివాదాల పాలవుతున్నాయి. మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఈ వివాదం మరింత ముదిరింది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే నటించిన ఈ చిత్రంలో ఒక పాటలో భాగ్యశ్రీ స్కర్ట్ ను నడుము దగ్గర పట్టుకొని లాగడం, వెనుక జేబుల్లో చేతులు పెట్టడం చేయించి వాటిని స్టెప్స్ అని చెప్పుకొచ్చాడు. ఆ స్టెప్స్ చూసినవారందరూ అవి స్టెప్సా.. తెలియక అడుగుతున్నా అవి స్టెప్సా అని అడుగుతున్నా అని మండిపడ్డారు.
ఇక మిస్టర్ బచ్చన్ తో ఆగకుండా శేఖర్ మాస్టర్.. డాకు మహారాజ్ తో మరోసారి రచ్చ చేశాడు. ఇందులో అయితే మరీ దారుణంగా.. ఊర్వశీ బ్యాక్ పై బాలకృష్ణ చేతులతో గుద్దుతున్నట్లు స్టెప్స్ వేయించాడు. అదైతే ఎంత పెద్ద రచ్చ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమాలో ఇలాంటి స్టెప్స్ ఉంటే ఎలా చూస్తారు. మరీ ఇంత దారుణంగనా డ్యాన్స్ వేయించేది అంటూ ఊగిపోయారు.
ఈ రెండు సాంగ్స్ ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. అప్పుడే అదిదా సర్ ప్రైజ్ అంటూ మరోసారి వచ్చేశాడు. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. ఈ సినిమాలో కేతిక శర్మ ఒక ఐటెంసాంగ్ చేసింది. అదే అదిదా సర్ ప్రైజ్. సాంగ్, కేతిక అందాలు, చంద్రబోస్ లిరిక్స్ అన్ని బావున్నాయి. కానీ, కేతిక హుక్ స్టెప్ మరోసరి చర్చనీయాంశంగా మారింది. ఆమె స్కర్ట్ ను లాగి స్టెప్ వేయడం జనాలకు నచ్చలేదు. దీంతో మరోసారి శేఖర్ మాస్టర్ పై నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.
సరే.. స్టెప్స్ బాలేదు కదా.. హిట్ అవ్వకూడదు కదా అంటే అమ్మా అదేలా కుదురుతుంది. ఒకపక్క తిడుతూనే ఉండాలి.. ఇంకోపక్క ట్రెండ్ చేస్తూనే ఉండాలి. కొంతమంది నెటిజన్స్ తీరు అలానే ఉంది. స్టెప్స్ బాలేదు అంటూనే వాటినే చూస్తున్నారు. ట్రోల్ చేస్తూనే ట్రెండ్ చేస్తున్నారు. రీల్స్, మీమ్స్ లో తిడుతూనే ప్రమోషన్స్ చేస్తున్నారు. దీనివలన ఆ సాంగ్ మరింత హైప్ తెచ్చుకుంటుంది. చూడనివారు కూడా ఈ ట్రోలింగ్ వలన చూడడం మొదలుపెడుతున్నారు.
శేఖర్ మాస్టర్ ను తిడుతున్నా ఆయనకు పేరుకు పేరు వస్తుంది. డబ్బుకు డబ్బు వస్తుంది. అవకాశాలకు అవకాశాలు వస్తున్నాయి. ఎన్ని తిట్టినా.. ట్రెండ్ కు తగ్గట్లు శేఖర్ మాస్టర్ స్టెప్స్ చూపిస్తున్నాడు. ఇక అలాంటి స్టెప్స్ వలన సాంగ్ వైరల్ అవుతుంది. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మేకర్స్ ఇంతకు మించిన పబ్లిసిటీ ఇంకేం కావాలి. సినిమా హిట్ అయినా ఫట్ అయినా సాంగ్ మాత్రం వైరల్ గా మారుతుంది.