Vijay Devarakonda: రౌడీ జనార్దన్ కోసం యాంగ్రీ మ్యాన్.. వావ్.. వాటే కాంబో.. ?

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే కింగ్డమ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అన్ని బావుండి ఉంటే మే 30 న కింగ్డమ్ థియేటర్స్ లో సందడి చేయాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడింది. మే 30 నుంచి జూలై 4 కు తమ సినిమా వాయిదా పడిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా తరువాత విజయ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిన విషయం విదితమే.
ఇప్పటికే టాక్సీవాలాతో విజయ్ కు హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా విజయ్ నటిస్తున్న మరో చిత్రం రౌడీ జనార్దన్. రాజావారు రాణిగారు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కింగ్డమ్ తరువాత విజయ్.. ఈ సినిమానే పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోవిలన్ గా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్.. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఒక్కో సినిమా చేస్తూ తెరపై కనిపిస్తున్నాడు. ఇక గతేడాది నితిన్ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించాడు.
కథ నచ్చితే.. కుర్ర హీరోల సినిమాల్లో చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన రాజశేఖర్.. ఇప్పుడు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆయనకు లుక్ టెస్ట్ కూడా చేశారని.. ఈ సినిమాలో హైలైట్ అయ్యే విలన్ పాత్రకు ఆయన బాగా సూట్ అయ్యాడని తెలుస్తోంది. రాజశేఖర్ లుక్ పై మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. నిజం చెప్పాలంటే.. విజయ్ – రాజశేఖర్ కాంబో అదిరిపోతోంది. మరిఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.