Published On:

VD14: టాక్సీవాలా కాంబో.. రష్మికతో రౌడీ హీరో రొమాన్స్ ..?

VD14: టాక్సీవాలా కాంబో.. రష్మికతో రౌడీ హీరో రొమాన్స్ ..?

VD14: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మే 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత విజయ్.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో VD14 చేస్తున్న విషయం తెల్సిందే. విజయ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా సినిమాల్లో టాక్సీవాలా ఒకటి. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది కూడా రాహుల్ నే. ఇన్నేళ్ల తరువాత ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతుంది.

 

చాలాకాలం తరువాత రాహుల్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎప్పటినుంచో ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.  అందుతున్న సమాచారం ప్రకారం అది నిజమే అని తెలుస్తోంది. విజయ్ – రష్మిక రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరి కాంబోలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చాయి.

 

ఇక ముచ్చటగా మూడోసారి ఈ జంట కనువిందు చేయనుందని తెలుస్తోంది. ఎప్పుడెప్పుడు రష్మిక – విజయ్ తమ ప్రేమను అధికారికంగా వెల్లడిస్తారా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గీతగోవిందం సినిమా నుంచే వీరి మధ్య ప్రేమాయణం మొదలయ్యింది. డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇన్ డైరెక్ట్ గా ఇద్దరు.. తాము ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొస్తూనే ఉన్నారు.

 

వెకేషన్, ఫెస్టివల్.. ఏదైనా రష్మిక, విజయ్ పక్కనే ఉంటుంది.  ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉంటున్నట్లు చెప్పుకొస్తున్నా.. లొకేషన్స్ బట్టి.. మాటలను బట్టి వారు రిలేషన్ లో ఉన్నట్లు అభిమానులు గుర్తించేస్తున్నారు. ఇక ఈ సినిమాలో  మరోసారి ఈ జంట రొమాన్స్  చేయనుంది అని తెలియడంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ జంట ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.