Published On:

Pooja Hegde: పూజా ఉంటే సినిమా ప్లాప్.. మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నాడంటే..?

Pooja Hegde: పూజా ఉంటే సినిమా ప్లాప్.. మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నాడంటే..?

Pooja Hegde: అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. పాపం.. ఈ చిన్నదానిపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తరువాత పూజా వరుసగా అరడజన్ సినిమాలు చేసింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ సినిమాల్లో కూడా తన లక్ ను పరీక్షించుకుంది. కానీ, అన్నిచోట్లా అమ్మడికి నిరాశనే ఎదురయ్యింది. దీంతో అభిమానులు.. పూజాను ఐరన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు.

 

ఇక చేసేది ఏమి లేక ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. చాలా గ్యాప్ తరువాత అమ్మడు రెట్రో సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమాలో పూజా హీరోయిన్ గా నటించింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంటుంది. అయితే ఇది కేవలం సూర్య ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చే సినిమా అని కొందరు చెప్పుకొస్తున్నారు.

 

ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని, సెకండ్ హాఫ్ గందరగోళంగా మారిందని అంటున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. రెట్రో సినిమాను డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ .. అభిమానులతో కలసి వీక్షించారు. అనంతరం మీడియా వేసిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చారు. ఇక ఈ నేపధ్యంలోనే ఒక విలేఖరి.. పూజా హెగ్డే ఉంటే సినిమా ప్లాప్ అవుతుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.. దానికి మీరేమంటారు అని అడగ్గా.. అందుకు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్  మాట్లాడాడు.

 

” అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. అందులో ఎలాంటి నిజం లేదు. ఆమె ఎంతో బాగా నటించింది. మా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మా చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు ” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి రెట్రో పాజిటివ్ టాక్ తో ఎన్ని కలెక్షన్స్ రాబట్టింది.. పూజా హిట్ అందుకుందా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.