Akkineni Naga Chaitanya: ఎన్టీఆర్ అలా చెప్పడం నాకు ఎంతో సంతోషానిచ్చింది

Akkineni Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క బిజినెస్ మ్యాన్ గా రెండు చేతులా సంపాదిస్తున్న విషయం తెల్సిందే. చై.. మొదట షోయూ పేరుతో ఒక జపనీస్ రెస్టారెంట్ ను ఓపెన్ చేశాడు. ఇందులో అన్ని జపాన్ కి చెందిన వంటకాలు దొరుకుతాయి. ఇక దీనికి తోడు ఈ మధ్యనే చై.. స్కూజి పేరుతో ఇంకో రెస్టారెంట్ ను కూడా ఓపెన్ చేశాడు.
తాజాగా ఈ రెస్టారెంట్ లో ఒక ఫుడ్ బ్లాగర్ చైతో ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో చై అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఎన్టీఆర్ .. షోయూలో దొరికే వంటకాలు చాలా బావుంటాయని చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. దేవర సినిమా జపాన్ లో రిలీజ్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్.. జపాన్ వెళ్లి ప్రమోషన్స్ చేసిన సంగతి తెల్సిందే. అక్కడ ఎన్టీఆర్ ను మీకు బాగా నచ్చిన రెస్టారెంట్స్ గురించి చెప్పమని అడగ్గా.. ఎన్టీఆర్ తడుముకోకుండా హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలో వైవిధ్యమైన ఫుడ్ ను సర్వ్ చేసే రెస్టారెంట్స్ ఉన్నాయి.
అక్కడ ఎంతో మంచి ఫుడ్ దొరుకుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోనే షోయూ పేరుతో ఒక రెస్టారెంట్ ఉంటుంది. అందులో జపనీస్ వంటకాలు దొరుకుతాయి. సూషీ చాలా బావుంటుంది. ఆ రెస్టారెంట్ నా సహనటుడు అక్కినేని నాగచైతన్యది అని చెప్పుకొచ్చాడు. ఇక షోయూకు ఎన్టీఆర్ ఇచ్చిన రివ్యూకు సంబంధించిన వీడియో చూసి తాను ఎంతో సంతోషపడ్డానని చై చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక చై కెరీర్ గురించి చెప్పాలంటే.. తండేల్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చై.. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో చై మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.