Published On:

NTR: బామ్మర్ది కోసం బావగారు వస్తున్నారోయ్..

NTR: బామ్మర్ది కోసం బావగారు వస్తున్నారోయ్..

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాల గురించి పక్కన పెడితే ఇండస్ట్రీ ఎప్పుడు ఎదగాలి అని కోరుకొనే హీరోల్లో ఎన్టీఆర్ ముందు ఉంటాడు. చిన్న, పెద్ద  సినిమాలు అనేది చూడకుండా కొత్తవారిని సపోర్ట్ చేస్తూ ఉంటాడు.  ఇక ఎన్టీఆర్ బామ్మర్దిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సొంత తమ్ముడే నితిన్.

 

నందమూరి హీరో బావ అవ్వడంతో నితిన్ టాలీవుడ్ ఎంట్రీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. శ్రీశ్రీ రాజావారు అనే సినిమాను మొదట అనౌన్స్ చేసినా.. మ్యాడ్ సినిమాతోనే నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ఆయ్ అంటూ ఒక చిన్న కథతో వచ్చి మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 

ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా మ్యాడ్ స్క్వేర్ కూడా మంచి ఫలితాన్నే రాబట్టింది. గత రెండు సినిమాలకు బావ ఎన్టీఆర్ బాగానే సపోర్ట్ ఇచ్చాడు. అప్పుడప్పుడు పోస్టర్స్, టీజర్ రిలీజ్ అంటూ నితిన్.. ఎన్టీఆర్ ను కూడా బాగానే వాడాడు. ఇక ఇప్పుడు ఏకంగా సక్సెస్ మీట్ కు చీఫ్ గెస్ట్ గానే ఆహ్వానించేశాడు.

 

నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించిన మ్యాడ్ స్క్వేర్ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. మొదట మిక్స్డ్ టాక్ అందుకున్నా.. ఉన్నా కొద్దీ కలక్షన్స్ బాగానే రాబట్టింది. దీంతో చిత్రబృందం రేపు అనగా ఏప్రిల్ 4 న మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ ను నిర్వహించడానికి ప్లాన్ చేసింది. ఈ సక్సె మీట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడని మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు.

 

మ్యాడ్ సక్సెస్ మీట్ లోనే ఎన్టీఆర్ సందడి చేస్తాడు అనుకున్నారు. అది కుదరలేదు. మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో అయినా ఎన్టీఆర్ ను భాగం చేయాలనుకున్నారు. దేవర ప్రమోషన్స్ కు జపాన్ వెళ్లడంతో అది కుదరలేదు. ఇక ఇప్పుడు మాత్రం నాగవంశీ వదిలేలా కనిపించడం లేదు. అందుకే ఎన్టీఆర్ ను ఎలాగైనా ఈ సక్సెస్ మీట్ కు తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యినట్లు తెలుస్తోంది. మరి రేపు బామ్మర్ది గురించి బావగారు ఎలాంటి స్పీచ్ ఇస్తారో చూడాలి.