Published On:

NTR: ఎన్టీఆర్ ఒరిజినల్ ఏంటో తెలుసా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో

NTR: ఎన్టీఆర్ ఒరిజినల్ ఏంటో తెలుసా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో

NTR: నందమూరి తారక రామారావు.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. తెలుగు సినిమా ఖ్యాతిని చెప్పడానికి ఈ పేరు చెప్తే చాలు. అంతడి మహనీయుడు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. పెద్ద ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ ముద్దుల తనయుడిగా ఎన్టీఆర్ అందరికీ సుపరిచితుడే. అయితే.. నందమూరి కుటుంబం మాత్రం తారక్ ను దూరం పెట్టింది. దానికి కారణం ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్యకు పుట్టిన బిడ్డ కావడమే.

 

హరికృష్ణ బ్రతికి ఉన్నంత కాలం. తన మొదటి భార్య కొడుకు కల్యాణ్ రామ్ ను.. ఎన్టీఆర్ ను సమానంగా పెంచాడు. ఆయన మరణం తరువాత ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒంటరి వారు అయ్యారు. నందమూరి కుటుంబం తారక్ ను దూరం పెట్టింది. అయినా ఇవేమీ పట్టించుకోకుండా తన నటనతో తారక్ అంచలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ కి ఆ పేరు కాకుండా వేరే పేరు ఉంది అన్న విషయం ఎవరికి తెలియదు.

 

ఎన్టీఆర్ తల్లి ఒక ముస్లిం. పెళ్లి తరువాత ఆమె తన పేరును షాలిని గా మార్చుకున్నారని సమాచారం. ఇక ఎన్టీఆర్ అసలైన పేరు నందమూరి తారక రామారావు కాదని తెలుస్తోంది. ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లో ఎన్టీఆర్ పేరు మొహమ్మద్ షరీబ్ రసూల్ ఖాన్ అని రాసి ఉంది. అతని తండ్రి పేరు మాత్రం నందమూరి హరికృష్ణ అని రాసి ఉండడంతో.. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఎన్టీఆర్ అసలు పేరు ఇదే అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

 

పెద్ద ఎన్టీఆర్ తన పేరును తన మనవడికి ఉండాలని.. ఒకరోజు తారక్ ను ఇంటికి పిలిచి ముద్దు చేస్తూ తన పేరునే మనవడికి పెట్టమని చెప్పినట్లు హరికృష్ణ ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచే తారక్ ను జూనియర్ ఎన్టీఆర్ గా పిలుస్తున్నారట. మరి ఇందులో ఏది ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.