Last Updated:

Samantha: నాగ చైతన్యపై రివెంజ్.. మొన్న పెళ్లి చీర.. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ రింగ్..?

Samantha: నాగ చైతన్యపై రివెంజ్.. మొన్న పెళ్లి చీర.. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ రింగ్..?

Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సామ్.. బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది.  ఇక సినిమాల  ఇవ్హస్యం పక్కన పెడితే.. ఆమె వ్యక్తిగత జీవితం అంతా వివాదాల్లోనే నడుస్తున్న విషయం తెల్సిందే. ఏ మాయ చేసావే సినిమాతో ఈ చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్నీ అందుకుంది. ఈ సినిమాతో విజయాన్నే కాదు.. తన ప్రేమను కూడా పరిచయం చేసింది.

 

అక్కినేని నాగచైతన్యతో సామ్ ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి పెళ్ళికి ముందు మూడు సినిమాల్లో కలిసి నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లికి దారి తీసింది. పెళ్లి తరువాత కూడా ఈ జంట  మజిలీ లాంటి హిట్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక  కోరుకున్నవాడితో పెళ్లి అవుతుంది అంటే .. ఏ అమ్మాయికి అయినా అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. సామ్ కూడా అందరి అమ్మాయిలనే.. చైతో పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంది. తమ పరిచయంలో తాము వెళ్లిన ప్లేస్ లను, మెమొరీస్ ను తన చీరపై డిజైన్ చేయించుకోని పెళ్లి చీరలా ధరించింది.

 

ప్రేమించినవాడు సొంతమవుతున్న తరుణంలో తాళి కట్టగానే సామ్ కంటతడిపెట్టడం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అంతలా ప్రేమించుకున్న ఈ జంట.. నాలుగేళ్లు కూడా కలిసి జీవించలేక విడాకులు తీసుకున్నారు. విడాకుకు కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియరాలేదు. కొంతమంది సామ్ ది తప్పు అంటే.. ఇంకొంతమంది చై అన్నారు. ఇక సోషల్ మీడియాలో సామ్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. చై – సామ్ ఇద్దరు వారి ఇష్టంతో విడిపోయారు. అనంతరం ఎవరి కెరీర్ ల మీద వారు ఫోకస్ పెట్టారు.

 

చై.. సామ్ ను మర్చిపోయి నటి శోభితాను గతేడాదిలో వివాహం చేసుకున్నాడు. సామ్ మాత్రం మయోసైటిస్ తో బాధపడుతూ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇంకోపక్క డైరెక్టర్ రాజ్ తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే సామ్.. తన గతం తాలూకు జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుందని తెలుస్తోంది. చైతో ఉన్న మెమొరీస్ ని అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు చై జ్ఞాపకాలను చెరిపివేయడానికి చూస్తున్నా.. అది తన వలన కావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే తన  పెళ్లి చీరను ఆమె ఒక డిజైనర్ డ్రెస్ గా మార్చేసింది.

 

ఇక ఇప్పుడు తనకు ఎంతో మంచి జ్ఞాపకంగా ఉన్న  ఎంగేజ్ మెంట్ రింగ్ ను కూడా ఒక పెండెట్ గా మార్చేసినట్లు తెలుస్తోంది. చై- సామ్ ఎంగేజ్ మెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గానిలిచింది  రింగ్. 3 క్యారెట్స్ డైమెండ్స్ పొదిగిన ఈ రింగ్.. పెళ్లి తరువాత కూడా సామ్ చేతికే ఉండేది. ఇప్పుడు దాన్ని కరిగించి అమ్మడు లాకెట్ లా మార్పించిందని తెలుస్తోంది. మొన్న పెళ్లి చీర, ఇప్పుడు ఈ రింగ్.. అమ్మడు చై జ్ఞాపకాలను వదలకుండా కొత్తగా మార్చుకొని ధరిస్తుంది.  ఇక దీంతో నెటిజన్స్.. అదిదా రివెంజ్ అంటే.. జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ బాధపడకుండా ఇలా చేయడం బావుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.