Last Updated:

NTR: ఎన్టీఆర్ కొత్త లుక్.. ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా.. అలా ఉంది

NTR: ఎన్టీఆర్ కొత్త లుక్.. ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా.. అలా ఉంది

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ మరింత బిజీగా మారాడు. కొన్నిసార్లు సినిమాలో ఉన్న లుక్ కన్నా.. యాడ్స్ లో వచ్చే లుక్ తోనే మరింత మెప్పించాడు. ఇప్పటివరకు ఎన్టీఆర్ చాలా బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. యాపి ఫీజ్, నవరత్న ఆయిల్, మెక్ డొనాల్స్డ్ , మలబార్ డైమండ్స్, ఒట్టో.. ఇలా చాలా బ్రాండ్స్ కోసం యాడ్స్ లో నటించాడు. తాజాగా మరో యాడ్ లో ఎన్టీఆర్ కనిపించి కనువిందు చేశాడు.

ఎన్టీఆర్ తాజాగా జెప్టో యాడ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిత్యావసర సరుకులు ఏవైనా సరే చిటికెలో డోర్ డెలివరీ యాప్ జెప్టో.  ఈ యాడ్ లో లేడీ కమెడియన్ విద్యుల్లేఖ కూడా నటించింది. ఒకేసారి చూసేయండి.. అన్ని తక్కువ ధరలకే అంటూ ఎన్టీఆర్ తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు.  యాడ్ బావున్నా.. అందులో ఎన్టీఆర్ లుక్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ అస్సలు బాలేదని కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్ కొత్త లుక్.. ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా.. అలా ఉంది. డిప్ప కటింగ్ చేయించినట్లుగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. 

 

ఇక ఎన్టీఆర్ సినిమాల గురించి చెప్పాలంటే.. ఆర్ఆర్ఆర్ తరువాత పాన్ ఇండియా లెవెల్లో స్టార్ గా మారిన తారక్ వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇది కాకుండా ఎన్టీఆర్ నటిస్తున్న మరో చిత్రం డ్రాగన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

 

వార్ 2, డ్రాగన్ తరువాత దేవర 2 రెడీ గా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమా గతేడాది రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ నే అందుకుంది. దీంతో దేవర పార్ట్ 2 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొరటాల ఈ సినిమా కథ మీదనే పనిచేస్తున్నాడు అని తెలుస్తోంది. మరి ఈ సినిమాలల్లో ఏ సినిమా కోసం ఎన్టీఆర్ ఈ హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేస్తున్నాడు. లేకపోతే కేవలం యాడ్ కోసమే ఈ హెయిర్ స్టైల్ ను అలా చేశారా.. ? అనేది తెలియాల్సి ఉంది.