Published On:

NTR: ఎన్టీఆర్ బర్త్ డే కి డబుల్ ట్రీట్.. ఫ్యాన్స్ కు పండగే

NTR: ఎన్టీఆర్ బర్త్ డే కి డబుల్ ట్రీట్.. ఫ్యాన్స్ కు పండగే

NTR: స్టార్ హీరోల పుట్టినరోజులు వస్తున్నాయి అంటే.. ఫ్యాన్స్ కు పండగే. కొత్త కొత్త సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయి. పోస్టర్స్, గ్లింప్స్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే అంటే ఇంకే రేంజ్ లో రచ్చ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే వస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆరోజు అభిమానులకు డబుల్ ట్రీట్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి డ్రాగన్ అయితే.. ఇంకొకటి వార్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ నీల్ సినిమా ఎప్పుడో పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం.

 

ఇక తారక్ పుట్టినరోజున ఈ టైటిల్ తో పాటు ఒక గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఇదే సర్ ప్రైజ్ అంటే.. వార్ 2 నుంచి కూడా ఒక గ్లింప్స్ రాబోతుందని టాక్. బాలీవుడ్ లో స్టార్ హీరోల బర్త్ డేకి ఇలాంటి ఆనవాయితీలు లేవు.

 

కానీ, ఎన్టీఆర్ కోసం వార్ 2 నుంచి పోస్టర్ కానీ, గ్లింప్స్ కానీ రిలీజ్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్. అలా ఈసారి తారక్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ రానుంది. మరి ఈ ట్రీట్స్ అభిమానులను ఎలా మెప్పిస్తాయో చూడాలి.ఇకపోతే వార్ 2 .. ఈ ఏడాది ఆగస్టు 14 న రిలీజ్ కు రెడీ అవుతుండగా .. డ్రాగన్. వచ్చే ఏడాది జూన్ 25 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాలతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.