Published On:

NC24: మైథలాజికల్ థ్రిల్లర్ మొదలు.. ఒక్క వీడియోతో హైప్ క్రియేట్ చేశారుగా

NC24: మైథలాజికల్ థ్రిల్లర్ మొదలు.. ఒక్క వీడియోతో హైప్ క్రియేట్ చేశారుగా

NC24: అక్కినేని నాగచైతన్య తండేల్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత జోష్ పెంచిన చై.. వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక తండేల్ తరువాత చై.. కార్తీక్ దండుతో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కార్తీక్.. ఈసారి అంతకుమించి మైథాలజికల్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు.

 

NC 24గా తెరకెక్కుతున్న ఈ సినిమాను BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. చై బర్త్ డే కు ఈ సినిమాను అధికారంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నేడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినట్లు మేకర్స్ తెలిపారు. ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ షూటింగ్ మొదలైంది అని చెప్పుకొచ్చారు. ఈ ఒక్క వీడియోతోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.

 

అసలు ఈ సినిమా ఎలా మొదలైంది అనే దగ్గర నుంచి సెట్స్ ఎలా వేశారు.. ? ఎక్కడ వేశారు..? నాగ చైతన్య మెకోవర్ అన్ని చూపించారు. ఇక అంతేకాకుండా ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడని మైథాలాజికల్ థ్రిల్లర్ ను చూడబోతున్నట్లు తెలిపారు.

 

ఇక సినిమాలో చై లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఒక్క వీడియో తోనే సినిమాపై అభిమానులకు భారీ అంచనాలను పెట్టుకొనేలా చేశారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో చై సరసన మీనాక్షీ చౌదరీ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో చై మరో పాన్ ఇండియా హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి: