Published On:

Anchor Ravi: ఆడియో వైరల్‌ – ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన యాంకర్‌ రవి

Anchor Ravi: ఆడియో వైరల్‌ – ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన యాంకర్‌ రవి

Anchor Ravi Apalogies: ఎట్టకేలకు యాంకర్‌ రవి క్షమాపణలు చెప్పాడు. ఇటీవల ఓ టీవీ షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ స్కిట్‌ చేశాడు. అయితే ఇది ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతిసే విధంగా ఉందంటూ సుధీర్, రవిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే యాంకర్‌ రవి తాను క్షమాపణలు చెప్పనంటూ మాట్లాడిన ఓ ఆడియో బయటకు వచ్చిన కాసేపటికి రవి క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేశాడు.

 

వివాదంలో యాంకర్ రవి, సుధీర్

ఓ హిందు ఆర్గనైజేషన్‌కి చెందిన వ్యక్తి రవికి ఫోన్‌ చేసి అసహనం వ్యక్తం చేశారు. సుడిగాలి సుధీర్‌, మీరు ఓ స్కిట్‌ చేశారు కదా.. అందులో మీరు హిందువులను కించపరచడం కరెక్ట్‌ కాదు కదా? అని ప్రశ్నించారు. దీనికి రవి.. అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా సినిమాలోనిది అని సమాధానం ఇచ్చాడు. అది తప్పు అని చెప్పలేదు కాబట్టి తాము ఇది చేశామన్నాడు. అది తప్పని చెప్పుంటే.. మేము ఇది చేసేవాళ్లం కాదు. ఆయన అభిమానులుగా ఆయన సినిమాలో సీన్‌ని మేము స్పూఫ్‌గా చేశామని సమాధానం ఇచ్చాడు. ఇది కరెక్ట్‌ కాదని, ఇలానే మీరు హిందువులను కించపరుస్తూ ఉంటారా? అని రవిపై విరుచుకుపడ్డారు. మీరు చేసింది కరెక్ట్‌ కాదని, హిందువులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాను ఏ తప్పుడ చేయలేదని, చిరంజీవి సినిమా చూసి చేశామన్నారు.

 

అది తప్పు అన్నారని యూట్యూబ్‌ నుంచి ఆ వీడియో డిలిట్‌ చేశామన్నారు. కాబట్టి తాను తప్పు చేయలేదు కాబట్టి, క్షమాపణలు చెప్పను అని రవి ఆయనకు సమాధానం ఇచ్చిన ఆడియో వైరల్‌గా మారింది. అయితే ఈ ఆడియో బయటకు వచ్చిన కాసేపటికే యాంకర్‌ రవి క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్‌ చేశారు. “నేను, మరికొందరు యాక్టర్స్‌తో కలిసి సూపర్‌ సీరియల్స్‌ అనే షోలో ఓ స్కిట్‌ చేశాం. ఇది రైటర్స్‌ని పెట్టుకుని చేసిన స్కిట్‌ కాదు. సినిమాలోని సీన్‌ని స్పూఫ్‌ చేశాం. ఇది కావాలని ఎవరి మనోభవాలను కించపరచాలనే ఉద్దేశంతో చేసినది కాదు. ఇది ముందుగా స్క్రిప్ట్‌ రాసి చేసింది కాదు. అప్పకప్పుడు ఓ సినిమాలోని సీన్‌ని స్పూఫ్‌ చేశాం. దీనివల్ల చాలా మంది హిందువులు హార్ట్‌ అయ్యారని తెలిసింది. చాలా కాల్స్‌ వస్తున్నాయి. ఇంకోసారి ఇలాంటి చేయకుండ జాగ్రత్త పడతాం. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. జై శ్రీరామ్‌.. జై హింద్‌” అని చెప్పుకోచ్చాడు.

 

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. కాగా ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా వచ్చిన ఓ ప్రత్యేకమైన షోలో యాంకర్‌ రవి, సుధీర్‌లు ఓ స్కిట్ చేశారు. ఇందులో ఈయన మహిమ గల దేవుడని, నందీశ్వరుడి కొమ్ముల నుంచి చూస్తే దేవుడు కనిపిస్తాడు బావ అని రవి.. సుధీర్‌తో అంటాడు. అయితే అప్పుడు సుధీర్‌ నందీశ్వరుడి కొమ్ముల నుంచి చూసి.. అదేంటి దేవుడు కనిపిస్తాడు అని చెప్పాడు.. నాకేంటి అమ్మోరు తల్లి కనిపిస్తుంది అని కామెంట్స్‌ చేస్తాడు. అయితే ఇది ఇప్పుడు హిందువుల మనోభవాలను కించపరిచేలా ఉందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: