Chhattisgarh : ఆపరేషన్ కగార్‌లో 31 మంది మావోలు మృతి : డీజీపీ అరుణ్‌దేవ్ గౌతం

Chhattisgarh : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు బీజాపూర్ జిల్లా ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట కేంద్రంగా ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సీఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్, ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ గౌతం తెలిపారు. బుధవారం బీజాపూర్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ జరిగిన 21 రోజుల్లో 31 మంది మావోలు మృతిచెందారని పేర్కొన్నారు. 16 మంది మహిళా మావోలు ఉన్నట్లు తెలిపారు.
మావోలపై రూ.1.72 కోట్ల రివార్డు..
ఆపరేషన్‌లో మృతిచెందిన మావోలపై రూ.1.72 కోట్ల రివార్డు ఉందని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో 18 మంది జవాన్లు గాయపడినట్లు తెలిపారు. మృతిచెందిన మావోయిస్టుల్లో 20 మందిని గుర్తించామని చెప్పారు. 11 మందిని గుర్తించాల్సి ఉందని వెల్లడించారు. 31 మంది మావోల నుంచి 35 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు కర్రెగుట్ట ఆపరేషన్ నిర్వహించామని పేర్కొన్నారు. ఈఏడాది మావోలకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్‌లో 174 మంది హార్డ్ కోర్ మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.