Paradise Movie: నాని – అనిరుధ్ కాంబో.. ఆడియో రైట్స్ ఆ మాత్రం లేకపోతే ఎలా.. ?

Paradise Movie: న్యాచురల్ స్టార్ నాని.. హిట్ 3 తో మంచి హిట్ అందుకొని ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక ఈ సినిమా తరువాత నాని నటిస్తున్న చిత్రం ప్యారడైజ్. దసరా లాంటి హిట్ సినిమా తరువాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ప్యారడైజ్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రా అండ్ రస్టిక్ కథతో దసరాను తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల.. ఈసారి ప్యారడైజ్ తో అంతకుమించి మాస్ కథతో రాబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటిసారి నానిని ఆ లుక్ లో చూసేసరికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేస్తున్నారు.
గత కొన్నిరోజుల నుంచి ప్యారడైజ్ ఆడియో రైట్స్ గురించి ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ప్యారడైజ్ ఆడియో రైట్స్ రూ. 18 కోట్లు సెట్ అయ్యిందని అంటున్నారు. ప్రముఖ ఆడియో సంస్థ అయిన సరిగమ.. ప్యారడైజ్ ఆడియో హక్కులను కైవసం చేసుకుందని సమాచారం. ఇది చిన్న అమౌంట్ కాదు.
నాని సినిమాకు ఈ రేంజ్ లో రావడం కూడా కొత్తేమి కాదు. కానీ, ఇప్పటివరకు సాంగ్స్ కంపొజిషన్ అవ్వకుండా.. నాని షూట్ చేయకుండా ఇంత రేటు పలకడం అనేది రికార్డ్ అనే చెప్పాలి. దీంతో నాని – అనిరుధ్ కాంబో అంటే ఆ మాత్రం లేకపోతే ఏలా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.