Published On:

Hero Nikhil: అలాంటి దేశాల కోసం మన డబ్బు ఖర్చు చేయాల్సిన అవరం లేదు – నిఖిల్ ట్వీట్‌ వైరల్‌

Hero Nikhil: అలాంటి దేశాల కోసం మన డబ్బు ఖర్చు చేయాల్సిన అవరం లేదు – నిఖిల్ ట్వీట్‌ వైరల్‌

Hero Nikhil Tweet on Turkey President Comments: భారత్‌-పాకిస్తాన్‌ వార్‌పై సినీ సెలబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ప్రశంసలు కురిపిస్తూ భారత సైన్యానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మన దేశానికి వ్యతిరేకంగా కామెంట్స్‌ చేస్తున్న వారిపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ టర్కి దేశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టర్కిని దేశ ప్రజలు బాయ్‌కాట్‌ చేయాలని పిలుపునిచ్చారు. మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించిన దేశాల కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిని అవసరం లేదన్నారు.

 

విహార యాత్రలకు ఆయా దేశాలకు వెళ్లకూడాదని పిలుపునిచ్చారు. కాగా భారత్‌-పాక్ వార్‌లో భాగంగా టర్కీ దాయాది దేశంకు మద్దతు తెలిపింది. ‘మంచి, చెడుల్లో మా సోదర దేశమైన పాకిస్తాన్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తాం’ ఆ దేశ ప్రధాని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ నిఖిల్‌ షేర్‌ చేస్తూ.. “ఇంకా ఎవరైనా టర్కీ వెళ్లాలనుకుంటున్నారా? దయచేసి ఈ పోస్ట్‌ చూడండి. ప్రతి ఏడాది టర్కీలో భారతీయులంత బిలియన్‌ డాలర్లు ఖర్చు పెడుతున్నారు. ప్లీజ్‌ ఇకపై ఆ దేశంలో మన డబ్బు ఖర్చు చేయడం ఆపండి. మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించిన దేశాలకు కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

 

విహార యాత్రలకు అలాంటి దేశాలకు మనం వెళ్లాల్సిన అవసరం లేదు” అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నిఖిల్‌కు మద్దతుగా నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మీరు చెప్పింది కరెక్ట్‌.. అలాంటి దేశాలను భారతీయులు బాయ్‌కాట్‌ చేయాలి. మీపై రెస్పాక్ట్‌ మరింత పెరిగింది బ్రో అంటూ పలువుకు కొనియాడుతున్నారు. కాగా నిఖిల్‌ ప్రస్తుతం స్వయంభు అనే సినిమా చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకంలో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సంయుక్త మీననన్‌, నభా నటేష్‌లు ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇందులో నిఖిల్‌ పోరాట యోధుడిగా కనిపించనన్నాడు.