Published On:

Realme Neo 7 Turbo Launched: సంథింగ్ సంథింగ్.. రియల్‌మీ నియో 7 టర్బో లాంచ్.. ఫీచర్స్ చూస్తే అవాక్కే..!

Realme Neo 7 Turbo Launched: సంథింగ్ సంథింగ్.. రియల్‌మీ నియో 7 టర్బో లాంచ్.. ఫీచర్స్ చూస్తే అవాక్కే..!

Realme Neo 7 Turbo Launched: రియల్‌మీ తన నియో 7 సిరీస్‌లో కొత్త శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను చేర్చబోతోంది. రియల్‌మీ నియో 7 టర్బో ఈ నెలలో చైనాలో లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఈ బ్రాండ్ దీనిని “ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన నియో” ఫోన్‌గా పిలుస్తుంది. అలానే ఫ్లాగ్‌షిప్-స్థాయి పనితీరును, సరికొత్త డిజైన్‌ను హామీ ఇస్తుంది. రండి, ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Realme Neo 7 Turbo Specifications
నివేదికల ప్రకారం.. మీడియాటెక్ కొత్త డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌ను కలిగి ఉన్న మొదటి స్మార్ట్‌ఫోన్ Realme Neo 7 Turbo అవుతుంది. ఇది 4nm ప్రాసెసర్, ఇందులో నాలుగు కార్టెక్స్-X4 సూపర్ కోర్లు, నాలుగు కార్టెక్స్-A720 పనితీరు కోర్లు ఉన్నాయి. ఇది డైమెన్సిటీ 9300 ప్లస్ అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెబుతున్నారు. బెంచ్‌మార్క్ నివేదికల ప్రకారం, ఈ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 కంటే మెరుగైన GPU పనితీరును అందిస్తుంది. ప్రత్యేకంగా, అజ్టెక్ 1440p పరీక్షలో, ఇది దాదాపు 95fps సాధించింది.

 

ఈ ఫోన్‌లో 1.5K రిజల్యూషన్‌తో ఫ్లాట్ OLED డిస్‌ప్లే అందించారు. కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో 50MP ట్రిపుల్ రియర్ కెమెరాను చూడచ్చు. అలాగే, ఈ ఫోన్‌లో 7,000mAh పెద్ద బ్యాటరీ ఉంటుందని వెల్లడించారు. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వగలదు. అదే సమయంలో, దీని డిజైన్ కూడా పూర్తిగా కొత్తగా ఉంటుందని చెబుతారు.

 

Realme Neo 7 Turbo Price
రియల్‌మీ నియో 7 టర్బో ధర నియో 7 కంటే కొంచెం ఎక్కువగా ఉండచ్చు. నియో 7 చైనాలో 2,199 యువాన్ల (సుమారు రూ.25,000) ధరకు విడుదల చేసింది. అటువంటి పరిస్థితిలో, టర్బో వెర్షన్ ధర దాదాపు 2,500 యువాన్లు (సుమారు రూ. 29,000) ఉంటుంది. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ iQOO Z10 టర్బో ప్రో, రెడ్‌మి టర్బో 4 ప్రో వంటి మొబైల్‌లతో పోటీ పడగలదు.

 

ఇండస్ట్రీ సమాచారం ప్రకారవ.. రియల్‌మీ నియో 7 టర్బో వాస్తవానికి రియల్‌మీ GT 7 గ్లోబల్ వెర్షన్ కావచ్చు. చైనాలో, GT 7 డైమెన్సిటీ 9400 ప్లస్ చిప్‌సెట్‌తో లాంచ్ కానుంది. దాని గ్లోబల్ వెర్షన్ డైమెన్సిటీ 9400e తో రావచ్చు, ఇది నియో 7 టర్బోగా పరిచయం చేయచ్చు. రియల్‌మీ GT 7 మే 27న లాంచ్ అయ్యే అవకాశం ఉంది.